ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:30 pm

మంగళవారం

1 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:30 pm

SENSEX76,957-0.90%
NIFTY24,080-1.04%
హైదరాబాద్ 22K₹1,46,870/10g-2.23%
హైదరాబాద్ 24K₹1,60,222/10g-2.23%
వెండి₹2,21,959/kg-1.19%

తాజా వార్తలు

హెచ్ఎంటీ నగర్ పెద్దచెరువు వద్ద దెబ్బతిన్న మ్యాన్‌ హోల్స్‌ కు మరమ్మత్తులు..

BRS leaders urge officials to resolve drainage backup issues caused by damaged manholes near HMT Nagar Pedda Cheruvu.

nagendra31 August 2026, 8:00 PM0 చూసులుtrinetnews.com
హెచ్ఎంటీ నగర్ పెద్దచెరువు వద్ద దెబ్బతిన్న మ్యాన్‌ హోల్స్‌ కు మరమ్మత్తులు..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

* ఇందిరానగర్‌లో డ్రైనేజీ రివర్స్ సమస్యకు పరిష్కారం చూపాలి..

* అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లిన బీఆర్‌ఎస్‌ నాయకులు..

నాచారం, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31

: హెచ్ఎంటీ నగర్ పెద్దచెరువు ఇందిరానగర్ వైపు చెరువు కట్ట పక్కన ఉన్న ట్రంక్ లైన్ మ్యాన్‌ హోల్స్ దెబ్బతినడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా భారీ వాహనాల రాకపోకలతో పలు మ్యాన్‌హోల్స్ మూతలు ధ్వంసమయ్యాయి. కొన్ని పూర్తిగా కూలిపోవడంతో ఇందిరానగర్‌లో డ్రైనేజీ నీరు రివర్స్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు సాయి జెన్ శేఖర్ ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దెబ్బతిన్న మ్యాన్‌ హోల్స్‌ ను పరిశీలించి, పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు నిర్మాణాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టి డ్రైనేజీ రివర్స్ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్యపై స్పందించిన జోనల్ కమిషనర్ రాధిక గుప్తా వెంటనే జలమండలి ఈడీ పంకజతో మాట్లాడారు. మ్యాన్‌ హోల్స్‌ లోని పూడిక తొలగింపు, అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి