ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:23 pm

బుధవారం

9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:23 pm

SENSEX75,004-1.51%
NIFTY23,475-1.67%
హైదరాబాద్ 22K₹1,44,291/10g-1.53%
హైదరాబాద్ 24K₹1,57,408/10g-1.53%
వెండి₹2,20,584/kg-0.17%

తాజా వార్తలు

వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దడవాయిల పాత్ర కీలకమైనవి

INTUC National President Dr. G. Sanjeeva Reddy assured that the government will be pressured to resolve the legitimate demands of Dadavai workers.

nagendra9 September 2026, 1:59 AM0 చూసులుtrinetnews.com
వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దడవాయిల పాత్ర కీలకమైనవి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో దడవాయిల పాత్ర కీలకమైనవి

*దడవాయి కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యల పరిస్కారం

* ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ డా. జి. సంజీవ రెడ్డి

రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 9 :

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్న దడవాయిల (తూకం) కార్మికుల పాత్ర కీలకమైనదని వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంతో

పాటు కనీస వేతనాలు చెల్లించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పరిష్కరిస్తామని ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ డా. జి. సంజీవ రెడ్డి హామీ ఇచ్చారు. దడవాయిల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్, రవీంద్ర భారతిలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ దడవాయిల యూనియన్ (ఐ.ఎన్.టి.యు.సి) రాష్ట్ర సదస్సు నిర్వహించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి దాదాపు 1500 మంది దడవాయిల కార్మికులు పాల్గొన్న ఈ సదస్సులో డా. జి. సంజీవ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి కనీస వేతనాలు, పి.ఎఫ్, గ్రాటియుటి, ఈ.ఎస్.ఐ, ఆరోగ్య భీమా ఇతర సౌకర్యాలు పొందడానికి దడవాయి కార్మికులు అర్హులని, వారి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తానన్నారు. దడవాయి కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యల పరిస్కారమైతాయని, ఐ.ఎన్.టి.యు.సి దడవాయి కార్మికులకు అండగా ఉంటూ వారికీ గౌరవం,

గుర్తింపు, సామజిక, ఉద్యోగ భద్రత కల్పనకై కృషి చేస్తుందని డా. జి.సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. . మొగుళ్ళ రాజి రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన తూకం అందించే దడవాయిల కార్మికుల డిమాండ్లు కూడా న్యాయమైనవేనని అన్నారు. దడవాయిలకు మెరుగైన పని పరిస్థితులు, తగిన వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల అమలుకై డా. జి.సంజీవరెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరిస్తామన్నారు. వై. నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో పనిచేస్తున్న దడవాయిల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, చట్టం ప్రకారం వారికీ కనీస వేతనాలు, పి.ఎఫ్, గ్రాటియుటి, ఈ.ఎస్.ఐ, ఆరోగ్య భీమా అమలు చేయవచ్చునన్నారు. దడవాయిల కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి ఐ.ఎన్.టి.యు.సి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్, ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వై. నాగన్న గౌడ్, వి. భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్. ఏ. జలీల్, కార్యదర్శి నల్ల సంజీవ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్ ల చైర్మన్లు రంగరెడ్డి, సతీష్, ఆనంద్ రావు పాటిల్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రవి కుమార్ అతిథులుగా పాల్గొన్నారు . యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్. సురేందర్ రెడ్డి, ఎన్. రవి కుమార్, రాష్ట్ర నాయకులు బి. వీరన్న, సంజీవ్ కుమార్, సుదర్శన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి