* 654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 3 జోన్లు, 14 సర్కిళ్లు, 74 వార్డులతో కార్పొరేషన్..
* ప్రజలకు మెరుగైన సేవలు, ఆధునిక మౌలిక వసతులే లక్ష్యంగా ముందుకు..
అంబర్ పేట్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31
: నూతనంగా ఏర్పాటైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) అధికారిక లోగోను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం అంబర్‌పేట్ స్టేడియంలో ఆవిష్కరించారు. కార్పొరేషన్ ప్రత్యేకత, పట్టణ అభివృద్ధి, ప్రజా సేవలు, భవిష్యత్ దిశను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ లోగో ఎంఎంసీకి అధికారిక ప్రతీకగా నిలవనుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పట్టణ పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 654 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్ జోన్లుగా విభజించి, 14 సర్కిళ్లు, 74 వార్డులతో కార్పొరేషన్ విస్తరించింది. 2026 ఫిబ్రవరిలో టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్‌ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేసింది. పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, పచ్చదనం, పట్టణ ప్రణాళిక, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంపై ఎంఎంసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో ఆధునిక, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం చేతుల మీదుగా లోగో ఆవిష్కరణ ఎంఎంసీ పరిపాలనా చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు.
[22:06, 2026/8/31] +91 99896 32234: End..





