హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 15: అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని, మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నామన్నారు.
తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్- వీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించిందని
మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం
అందించాలని సీఎం కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు.
మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతాం
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్- వీ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామమన్నారు.
100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారని, 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం చెప్పారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని,నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందని సీఎం పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మాణం జరుగుతుందని,
సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని సీఎం తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.





