హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 9:
బీఆర్ఎస్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఫాంహౌస్‌లో కుట్రకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. సభను అడ్డుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు కుట్ర చేశారని ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. మూడు రోజుల ఘటనలకు ఫాంహౌస్ సాక్షిగా కుట్ర జరిగిందని ఆరోపించారు. అసెంబ్లీ ఘటనలపై
విచారణకు ఆదేశించామని అన్నారు. దళితులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం.. విద్వేషాలు, అల్లర్లు రెచ్చగొట్టడం నేరమని హెచ్చరించారు. దళితులపై అణచివేత, దురాగతాలకు పాల్పడిన వారిని, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కుట్ర చేసిన వారితో పాటు అమలు చేసిన వారిని.. కోర్టులో నిలబెట్టి శిక్షించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.





