ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం7 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:25 pm

సోమవారం

7 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:25 pm

SENSEX76,133-1.05%
NIFTY23,779-1.15%
హైదరాబాద్ 22K₹1,45,225/10g+2.96%
హైదరాబాద్ 24K₹1,58,427/10g+2.96%
వెండి₹2,18,986/kg+3.30%

తాజా వార్తలు

కేసీఆర్, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

BRS leader Shravan Kumar condemned Chief Minister Revanth Reddy's remarks against KCR and KTR, demanding answers on the implementation of six guarantees.

nagendra7 September 2026, 11:03 AM1 చూసులుtrinetnews.com

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్06

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉప్పల్‌ నియోజకవర్గం మల్లాపూర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

కేసీఆర్‌ రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేయడంపై శ్రవణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యాదాద్రి ఆలయాన్ని నిర్మించినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినందుకా.. బస్తీ దవాఖానాలు, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకా కేసీఆర్‌ రాజీనామా చేయాలి?’’ అని ప్రశ్నించారు. వృద్ధాప్య, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల్లో ఇప్పటివరకు ఏం అమలు చేశారో రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన.. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పాలనపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలను కూడా శ్రవణ్‌కుమార్‌ తప్పుబట్టారు. కేసీఆర్‌ ఏం చేస్తున్నారో తెలియకుండా విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై నోరు అదుపులో పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.

కేసీఆర్‌, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన చేపడతాయని తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 16 డివిజన్ల నుంచి బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులు తరలివస్తారని శ్రవణ్‌కుమార్‌ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

ఎల్ నినో ప్రభావానికి తోడుగా విద్యుత్ కోతలతో వరిపంటకు నీటి పారుదలలో సమస్యలు  చేతికి అందివచ్చే సమయంలో నీటిలభ్యతలో అసౌకర్యాలు

Paddy farmers in Yadadri Bhuvanagiri district are struggling to save their crops as El Nino and severe power cuts disrupt irrigation just before harvest.

మిగతా చదవండి →