నాచారం, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9 :
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. నాచారం, హెచ్‌ఎంటీ నగర్ డివిజన్ లకు చెందిన పలువురు ఆర్థిక సాయం కోసం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. వారి అభ్యర్థనలను పరిశీలించిన ఎమ్మెల్యే సీఎం కార్యాలయం ద్వారా రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బన్నెపాక పరశురాం రూ.42,000, టి. రేఖ రూ.37,500, బి. శశిరేఖ రూ.54,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.1,33,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.
Latest News
CM Relief Fund a boon for the poor: BRS leaders
BRS leaders distributed CMRF checks worth Rs 1,33,500 to beneficiaries in Nacharam and HMT Nagar divisions, facilitated by Uppal MLA Bandari Laxma Reddy.
nagendra10 September 2026, 2:06 AM2 व्यूtrinetnews.com

Share this story
Share link keeps your language (?lang=)
यह भी पढ़ें
सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं
और पढ़ें →సుపరిపాలనకు పారదర్శకత, జవాబుదారీతనం కీలకం అంతర్ పార్లమెంటరీ యూనియన్ సభలో హరివంశ్ పిలుపు

గణాంక పరిశోధన, సమాచార విశ్లేషణలో సహకారానికి ఒప్పందం పహ్లే ఇండియా ఫౌండేషన్‌తో చేతులు కలిపిన జాతీయ గణాంక కార్యాలయం

గణాంక పరిశోధనకు సహకారంపహ్లే ఇండియా ఫౌండేషన్‌తో కేంద్ర గణాంక శాఖ అవగాహన ఒప్పందం

