Friday9 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,889/10g-0.16%
भाषाएँ

Latest News

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నేడు తిరుమలకు ముఖ్యమంత్రి... స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Chief Minister N. Chandrababu Naidu will arrive in Tirumala on Tuesday to present silk garments to Lord Venkateswara on behalf of the state government during the annual Brahmotsavams.

nagendra16 September 2026, 1:58 AM3 व्यूtrinetnews.com
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు నేడు తిరుమలకు ముఖ్యమంత్రి... స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ

Share this story

Share link keeps your language (?lang=)

రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం

అమరావతి, ట్రైనెట్ న్యూస్

సెప్టెంబర్‌ 15: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు తిరుమలలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి... సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు గాయత్రీ నిలయానికి చేరుకుంటారు. రాత్రి 7.40 గంటలకు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు. అనంతరం రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం గాయత్రీ నిలయానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.

తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

బుధవారం ఉదయం 8.40 గంటలకు వీఐపీ క్యూ కాంప్లెక్స్‌-1లోని 17వ కంపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన యాత్రికుల అనుభవ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం

9.15 గంటలకు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ వద్ద ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రారంభిస్తారు. 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించి

అధికారులతో సమావేశమవుతారని పేర్కొన్నారు.

यह भी पढ़ें

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

और पढ़ें →