హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30 :
హైదరాబాద్ నగరంలోని రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, సంచార జీవనం సాగించే కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశాము.ఈ సందర్భంగా దుస్తులు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందుకున్న వాళ్లు స్కై ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కై ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ. పావని పాల్గొన్నారు.
వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్.





