హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ సెప్టెంబర్ 05:
జయ సంగీత రాగ మాలిక ఆధ్వర్యంలో
హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభ, గుండవరపు హనుమంత రావు కళా వేదికలో ‘ సీజన్ 6’ పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, వ్యాఖ్యాత, గాయకురాలు అయిన త్రివేణి కొమ్మరాజు నిర్వహణలో గాయనీ, గాయకులు ఆనంద్ , మనోహర్, మూర్తి మారుతి, మల్లాది విష్ణు కుమార్ , రవి బాబు, ప్రసాద్, విజయ లక్ష్మి, కార్తికేయ గ లక్ష్మి రాజ్యం ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






