ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం25 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:01 amసూర్యాస్తమయం 6:35 pm

మంగళవారం

25 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:01 am

సూర్యాస్తమయం 6:35 pm

SENSEX77,656+0.97%
NIFTY24,335+1.06%
హైదరాబాద్ 22K₹1,53,270/10g+3.61%
హైదరాబాద్ 24K₹1,67,204/10g+3.61%
వెండి₹2,24,662/kg-0.30%

తాజా వార్తలు

మానవత్వం చాటుకున్న చిలకలగూడ పోలీసులు

Chilakalaguda police in Secunderabad demonstrated compassion by providing medical care, new clothes, and shelter to an injured 70-year-old destitute man.

nagendra13 August 2026, 8:23 PM2 చూసులుtrinetnews.com
మానవత్వం చాటుకున్న చిలకలగూడ పోలీసులు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అనాథ వృద్ధుడికి అండగా నిలిచిన చిలకలగూడ పోలీస్ స్టేషన్

చిలకలగూడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్ పండుగల శ్రీనివాస్ రిపోర్ట్

ఆగస్టు 13/08/2026

ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ చిలకలగూడ పోలీసులు తమ ఉదారతను, మానవత్వాన్ని చాటుకున్నారు. ఆప్యాయతకు దూరమై, చేతికి గాయంతో అల్లాడిపోతున్న ఓ వృద్ధుడికి అండగా నిలిచి సమాజంలో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 70 ఏళ్ల కాళిదాస్ అనే వృద్ధుడి కుడిచేతికి తీవ్ర గాయమైంది. అతడిని చూసుకోవడానికి ఎవరూ లేక అవస్థలు పడుతుండగా గమనించిన చిలకలగూడ ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ మరియు ఎస్‌జీ రవీందర్‌లు తక్షణమే స్పందించారు. ముందుగా ఆ వృద్ధుడికి చేతికి అవసరమైన వైద్య చికిత్సను అందించారు. వృద్ధుడు దుస్తులు కూడా బాగా పాడైపోవడంతో పోలీసులు దగ్గరుండి కొత్త దుస్తులు కొనిచ్చి, అతడికి ధరింపజేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు సురక్షితంగా బోయిగూడలోని మదర్ థెరిసా హోమ్‌కు తరలించి ఆశ్రయం కల్పించారు. సమయానుకూలంగా స్పందించి వృద్ధుడికి సాయం అందించిన పోలీసు అధికారుల ఉదారతను స్థానికులు విశేషంగా కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి