E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:11 pm

బుధవారం

23 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:11 pm

SENSEX74,529+0.26%
NIFTY23,329+0.48%
హైదరాబాద్ 22K₹1,43,915/10g-0.33%
హైదరాబాద్ 24K₹1,56,998/10g-0.33%
వెండి₹2,23,754/kg+2.98%

తాజా వార్తలు

ఎల్నినో ఎదుర్కొనేందుకు కేంద్రం సహకారం అందించాలి -సీఎం రేవంత్ రెడ్డి

Chief Minister Revanth Reddy met Union Minister Shivraj Singh Chouhan at the Southern States Agriculture Ministers Conference in Madhapur, discussing PMAY-G housing allocations and agricultural challenges due to El Nino.

nagendra19 September 2026, 2:25 AM2 చూసులుtrinetnews.com
ఎల్నినో  ఎదుర్కొనేందుకు కేంద్రం సహకారం అందించాలి -సీఎం రేవంత్ రెడ్డి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 18:

మదాపూర్ లో జరుగుతున్న దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో శుక్రవారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పీఎంఏవై-జీ పథకంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రానికి 2 లక్షల ఇండ్లను కేటాయించిన సందర్భంగా కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.

11,56,915 అర్హులైన గ్రామీణ కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని గత జూలైలో కేంద్రమంత్రికి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం అందజేశారు.

రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇండ్లను కేటాయించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంపై కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగిందని సీఎం చెప్పారు. ఎల్నినో నేపథ్యంలో తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని సీఎం కేంద్రమంత్రి కి వివరించారు. వ్యవసాయ రంగంలో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం కోరారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తున్నామని,

సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నామని,

అదే విధంగా ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులకు ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎం వివరించారు.

250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం కేంద్ర మంత్రి కి తెలిపారు.

పంట మార్పిడిపై రైతులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించి సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

ఇవి కూడా చదవండి

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు

శ్రీకాంత్ అన్నకు జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ సభ్యుల ఘన జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రాపోలు హైదరాబాద్, సెప్టెంబర్ 21 (ట్రైనెట్ న్యూస్): శ్రీకాంత్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకుని జేఎంఎఫ్ఏ–టీఆర్‌టీ (

మిగతా చదవండి →

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం

శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో సుందరకాండ పారాయణం నవరాత్రోత్సవాల్లో 9వ రోజు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ట్రైనెట్ న్యూస్): ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థా

మిగతా చదవండి →

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద

మిగతా చదవండి →

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా నిర్మాణాలు * స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌తో విమానాశ్ర‌యాల ప‌నులు చేప‌ట్టాలి... * శాఖ‌ల మ‌ధ్య స‌మన్వ‌యంతోనే ప‌నులు వేగ‌వంతం * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

మిగతా చదవండి →