Saturday10 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,205/10g+1.57%
भाषाएँ

Latest News

Central Technical Team to Visit Kothagudem Airport Proposal on Sept 7

A central technical team will visit Telangana on September 7 to inspect alternative sites for the proposed Kothagudem airport, following a meeting between State Minister Tummula Nageswara Rao and Union Civil Aviation Minister Rammohan Naidu.

nagendra1 September 2026, 2:04 PM5 व्यूtrinetnews.com
Central Technical Team to Visit Kothagudem Airport Proposal on Sept 7

Share this story

Share link keeps your language (?lang=)

నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన

సాంకేతిక నివేదిక అనంతరం తదుపరి చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి హామీ

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ

భద్రాద్రి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 1 :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది. న్యూఢిల్లీలో మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడితో సమావేశమైన అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. కేంద్ర సాంకేతిక బృందం నివేదిక అనుకూలంగా వచ్చిన అనంతరం కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 2న కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు తండ్రి, దివంగత ఎర్రన్నాయుడు తన చిరకాల మిత్రుడని మంత్రి తుమ్మల గుర్తుచేసుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని, జిల్లా ప్రజలకు విమానాశ్రయం అవసరాన్ని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు.

“భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, వెంటనే కేంద్ర సాంకేతిక బృందాన్ని పంపేందుకు చర్యలు చేపట్టిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →