న్యూ ఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 15: దేశంలో డిజిటల్ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రూ. 2,000 వరకు జరిపే యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై తన వైఖరిని తేటతెల్లం చేసింది రూ. 2,000, అంతకు మించిన మొత్తంపై అదనపు ఛార్జీలను విధించే విషయంపై తీసుకున్న నిర్ణయం కావడం వల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మేరకు అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది. బ్యాంకులు లేదా పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే వంటి.. పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు రూ. 2,000 రూపాయలు, అంతకుమించిన మొత్తంతో జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు చార్జీలు విధించకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ కింద లభించిన అధికారాలను ఉపయోగించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్ ద్వారా రోజువారీ కొనుగోళ్లు నిర్వహించే సామాన్య ప్రజలు, చిన్న తరహా వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట కలిగినట్టయింది. ప్రస్తుతం యూపీఐ, రూపే ద్వారా జరిగే ఈ డిజిటల్ లావాదేవీల నిర్వహణ వ్యయాన్ని బ్యాంకులు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, పేమెంట్ కంపెనీలే భరిస్తూ వస్తోన్నాయి. ఇకపై వీటిని యూజర్లకు బదలాయిస్తారంటూ కొన్ని రోజులుగా వార్తలు వెలుడుతున్న విషయం తెలిసిందే. కేంద్రం సైతం వీటిపై లీకులు ఇచ్చింది ఇదివరకు. దీంతో డిజిటల్ పేమెంట్ చెల్లింపుదారుల్లో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. తాజా గెజిట్ విడుదలతో.. వాటన్నింటికీ తెరదించింది కేంద్రం.
తాజా వార్తలు
యూపీఐ, రూపే పేమెంట్లపై అర్ధరాత్రి గెజిట్ విడుదల చేసిన కేంద్రం
The Union Ministry of Finance issued a midnight gazette notification clarifying that no extra charges will be levied on UPI and Rupee transactions up to Rs. 2,000.

ఈ వార్తను షేర్ చేయండి
లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది
ఇవి కూడా చదవండి
ఆధునిక వీధినాటికలను ప్రోత్సహించాలి శ్రీజ సాదినేని

Noted theatre and film personality Sreeja Sadineni emphasized the need to promote modern street plays for future generations.
మిగతా చదవండి →ఆకట్టుకున్న పేరణి , ఆంధ్ర నాట్య ప్రదర్శనలు *శ్రీచంద్ర కళా నిలయం పన్నెండు కళాప్రస్థాన వేడుకలు

Sri Chandra Kala Nilayam celebrated its 12th anniversary with captivating classical dance performances by around 100 students at Ravindra Bharati, Hyderabad.
మిగతా చదవండి →అక్టోబర్ 2న గ్రాండ్గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం

The raw and rustic film 'Anakapalli', starring Vikram Sahidev and directed by Khagesh Thammineni, is gearing up for a grand release in Telugu and Tamil on October 2.
మిగతా చదవండి →గ్రామీణ నిరుద్యోగానికి పరిశ్రమలు–యువత అనుసంధానమే పరిష్కారం సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్మేళా

Minister Uttam Kumar Reddy announced that a mega job mela will be held in Kodad on September 19, featuring over 300 companies and offering more than 3,500 jobs to rural youth.
మిగతా చదవండి →