ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి నేతల నిరసన.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు..
ఉస్మానియా యూనివర్సిటీ, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 12 :
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన నిరసనను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్‌ఎస్‌వీ, ఓయూ మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్, ఓయూ మాదిగ జేఏసీ చైర్మన్ బుసిపాక గణేష్ మాదిగ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంపల్లి నరేష్, గణేష్ మాదిగ మాట్లాడుతూ దళితులు, మాదిగల అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చావు డప్పులతో నిరసన చేపట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో దళితులు, మాదిగ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో పలువురు మాదిగ విద్యార్థి నాయకులకు రాజకీయ, రాష్ట్రస్థాయి పదవుల్లో అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీవ్రంగా ప్రతిఘటిస్తామని విద్యార్థి నేతలు హెచ్చరించారు. దళిత విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శులు కొండా గణేష్, గంగధార వెంకట్, అర్జున్, గోపి, సాయి, సాయికిరణ్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.





