హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్,4.
కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్యాలను నిరసిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు శుక్రవారం పద్మారావు నగర్ చౌరస్తాలో BRS పార్టీ పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యం లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించరు.. అధికారం లో కి రాక ముందు కళ్ల బొల్లి మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత హామీలన్నింటినీ తుంగలో తొక్కారని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన విమర్శించారు.. మహిళకు 2500 నగదు, కల్యాణ లక్ష్మి పథకం అమలు తో పాటు తులం బంగారం, మహిళలకు స్కూటీలో ఇస్తామని హామీ ఇచ్చారని పార్టీ అధికారం లోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు.. నిరసన కార్యక్రమాలు భాగంగా రేపు శనివారం ఎస్పీ కాలేజ్ ప్రాంగణం నుంచి ఫీజ్ రీయింబర్స్మెంట్ అమలు చేయని కారణంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తామని కార్యక్రమంలో mla తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారని పవన్ కుమార్ తెలిపారు.. వంట వార్పు కార్యక్రమం లో ఏసూరి మహేష్, డివిజన్ అధ్యక్షులు రాజు, వెంకట రమణ, శ్రీకాంత్ రెడ్డి, కౌసల్య, అమృత,అనిత, నాగలక్ష్మి, లక్ష్మి దుర్గా కుశాల్ అంబులెన్స్ సురేష్, మహేందర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, లంబూ శ్రీనివాస్, ముక్క శ్రీనివాస్, పాషా తదితరులు పాల్గొన్నారు….






