ట్రై నెట్ న్యూస్,సెప్టెంబరు05/:
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల దగా పాలనను నిరసిస్తూ, పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని, పక్కాగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి ఆదేశానుసారం ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది యువజనులు, విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి, అన్ని మండలాల యూత్ అధ్యక్షులు,బిఆర్ఎస్వీ అధ్యక్షులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.








