ట్రైనెట్ న్యూస్,యాదాద్రి భువనగిరి,సెప్టెంబరు08:
బీజేపీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఉదయం హైదరాబాద్ లోని గోలి ప్రభాకర్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా ఏనుగు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఉమ్మడి జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నుండి రాష్ట్ర కార్యదర్శిగా మరియు బీజేపీ ప్రస్తుత తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిగా పని చేసి 2009 లో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచారు.పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ దివ్యాoగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.భవిష్యత్లో ప్రభాకర్ కి ఇంకా ఉన్నత పదవులు లభించాలని ఆశించారు.ఈ కార్యక్రమంలో నాగం సత్తిరెడ్డి, బీమిడి తిరుమల రెడ్డి, మోత్కూర్ మండల అధ్యక్షులు గూదే మధుసూదన్ యాదవ్, పాండురంగ చారి, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.





