ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:24 pm

మంగళవారం

8 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:24 pm

SENSEX76,133-1.05%
NIFTY23,779-1.15%
హైదరాబాద్ 22K₹1,44,959/10g+2.78%
హైదరాబాద్ 24K₹1,58,137/10g+2.78%
వెండి₹2,20,954/kg+4.24%

తాజా వార్తలు

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికరెడ్డి హౌస్ అరెస్ట్

Police placed BJP State Vice President Banda Karthika Reddy under house arrest ahead of the party's call to besiege the Assembly over fee reimbursement dues.

nagendra8 September 2026, 1:34 AM0 చూసులుtrinetnews.com
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికరెడ్డి హౌస్ అరెస్ట్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్07

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మాజీ మేయర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తికరెడ్డిని తార్నాక లోని ఆమె నివాసం లో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమానికి అనుమతి కోరినా పోలీసులు అనుమతి నిరాకరించారని కార్తికరెడ్డి తెలిపారు. బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో చాలా వరకు అమలు కాలేదని ఆరోపించారు.

ప్రభుత్వం 1,000 రోజుల పాలన పేరుతో కోట్లాది రూపాయలు ప్రచార కార్యక్రమాలకు ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. మరోవైపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ల బకాయిలు చెల్లించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

రాష్ట్రంలోని సుమారు 40 లక్షల మంది విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు.

విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, హామీలను అమలు చేయలేకపోతే విద్యాశాఖ బాధ్యత వహిస్తున్న వారు పదవికి రాజీనామా చేయాలని కార్తికరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

సీఎం క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

సీఎం క్షమాపణ చెప్పాలి  కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజలు చావు డప్పు కొడుతున్నారు: బిఆర్‌ఎస్ నాయకులు కల్లూరి రామచంద్ర రెడ్డి

BRS leader Kalluri Ramachandra Reddy demanded that Chief Minister Revanth Reddy apologize for governance failures, stating the public is turning against Congress.

మిగతా చదవండి →