Friday9 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,267/10g+1.57%
भाषाएँ

Latest News

BJP Leader Virender Goud Slams Govt and Police Over Tukkuguda Nurse Rape and Murder

nagendra31 August 2026, 7:56 PM6 व्यूtrinetnews.com
BJP Leader Virender Goud Slams Govt and Police Over Tukkuguda Nurse Rape and Murder

Share this story

Share link keeps your language (?lang=)

* కేసును తొక్కిపెట్టేందుకు చూస్తే కోల్‌కతా ‘ఆర్జీ కర్’ ఘటన తరహాలోనే తీవ్ర పరిణామాలుంటాయి!

* ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలి.. అవసరమైతే కేసును సీబీఐకి అప్పగించాలి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31:

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల భద్రత గాలిలో దీపంలా మారిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న గిరిజన (ఎస్టీ) యువతిపై జరిగిన అత్యాచారం, హత్య అత్యంత పాశవికమని, ఇది సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జీవనోపాధి కోసం ఖమ్మం/కొత్తగూడెం ప్రాంతం నుంచి వచ్చిన ఓ యువతి స్థానిక ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ సమీపంలోని హాస్టల్‌లో ఉంటోందని తెలిపారు. పక్కనే ఉన్న మెకానిక్ షాపులో పనిచేసే సనావుల్లా ఖాన్ అనే వ్యక్తి దుర్మార్గంగా హాస్టల్ గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడని, ఆమె ప్రతిఘటించడంతో అత్యంత కిరాతకంగా హత్య చేశాడని పేర్కొన్నారు. నిందితుడు పెట్రోల్ పోసి ఆధారాలు చెరిపివేసేందుకు సైతం ప్రయత్నించాడని సమాచారం వస్తోందని చెప్పారు.

సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు స్పష్టంగా గుర్తించబడినప్పటికీ, పోలీసులు నిన్నటివరకు కేసు నమోదు చేయకుండా, అరెస్టును అధికారికంగా ధ్రువీకరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. మృతురాలి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి, నష్టపరిహారం పేరుతో నచ్చజెప్పి పోస్టుమార్టం హడావుడిగా ముగించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, కేసును తొక్కిపెట్టే కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని వీరేందర్ గౌడ్ ఆరోపించారు.

కోల్‌కతాలోని ‘ఆర్జీ కర్’ మెడికల్ కాలేజీ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం నేరస్థులను కాపాడేందుకు ఏ విధంగా ప్రయత్నించిందో, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహాలో నిందితుడిని రక్షించే విధంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఒకే వారంలో మహిళలు, మైనర్లపై వరుస అకృత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కొద్దిరోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ మైనర్ బాలికతో అసభ్య వీడియోల్లో పట్టుబడితే... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కనీస ప్రకటన కూడా చేయలేకపోయాయని విమర్శించారు.

తుక్కుగూడ, మంఖాల్ ప్రాంతాలలో విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన హాస్టళ్లు, డ్రగ్స్ వాడకం, సరైన వివరాలు లేని ఇతర ప్రాంతాల వారి వల్ల శాంతిభద్రతలు క్షీణించి స్థానిక మహిళలు, విద్యార్థినులు భయాందోళనలతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో ప్రభుత్వం నిష్పాక్షికంగా, అత్యంత పారదర్శకంగా దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని బీజేపీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం కలిగించేలా దర్యాప్తు జరగకపోతే, ఈ కేసును తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించాలని డిమాండ్ చేశారు.

यह भी पढ़ें

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के पूर्व छात्रों का स्नेह मिलन समारोह

रेलवे डिग्री कॉलेज के छात्रों का स्नेह मिलन समारोह। हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर। पूर्व छात्रों का स्नेह मिलन समारोह उत्साहपूर्वक आयोजित किया गया।

और पढ़ें →

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से शुरू होंगे ‘प्रजाला బతుకమ్మ–2026’ (प्रजाला बతుకమ్మ-2026) उत्सव

कल से रविन्द्र भारती में एंगिलीपूला बతుకమ్మ के साथ ‘प्रजाला బతుకమ్మ–2026’ उत्सव शुरू होगा। 18 अक्टूबर को टैंक बंड पर सद्दूला बతుకమ్మ। हैदराबाद, 9 अक्टूबर (ट्रैनेट न्यूज):

और पढ़ें →

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह

तत्काल प्रकाशन के लिए महिला सशक्तिकरण के प्रतीक के रूप में सेंट फ्रांसिस कॉलेज में 46वां दीक्षांत समारोह हैदराबाद, ट्राइनेट न्यूज़, 9 अक्टूबर 2026: हैदराबाद के बेगमपेट स्थित सेंट फ्रांसिस महिला कॉलेज में 46वां दीक्षांत समारोह भव्य रूप से आयोजित किया गया।

और पढ़ें →

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

युवाओं में अच्छा करने की सोच होनी चाहिए: डॉ. के.वी. रमणाचारी

हैदराबाद, ट्राइनेट न्यूज, 9 अक्टूबर: तेलंगाना राज्य सरकार के पूर्व सलाहकार डॉ. के.वी. रमणाचारी ने कहा कि आज के युवाओं में दूसरों का भला करने की सोच होनी चाहिए।

और पढ़ें →