ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

బుధవారం9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:03 amసూర్యాస్తమయం 6:23 pm

బుధవారం

9 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:03 am

సూర్యాస్తమయం 6:23 pm

SENSEX74,957-1.57%
NIFTY23,497-1.58%
హైదరాబాద్ 22K₹1,44,315/10g-1.53%
హైదరాబాద్ 24K₹1,57,435/10g-1.53%
వెండి₹2,20,678/kg-0.14%

తాజా వార్తలు

గ్రాఫాలజీ, వ్యక్తిత్వ వికాస రంగాల్లో భూమా శ్రీనివాసరావు సేవలు మరువలేనివి

Telangana's first Legislative Assembly Speaker and MLC Madhusudhana Chary lauded Bhuma Srinivasa Rao's invaluable services in graphology and counseling.

nagendra9 September 2026, 2:01 AM0 చూసులుtrinetnews.com
గ్రాఫాలజీ, వ్యక్తిత్వ వికాస రంగాల్లో భూమా శ్రీనివాసరావు సేవలు మరువలేనివి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

రవీంద్ర భారతి, హైదరాబాద్ , ట్రైనెట్ న్యూస్ 8 :

గ్రాఫాలజీ, సైకాలజీ, కౌన్సిలింగ్, వ్యక్తిత్వ వికాస రంగాల్లో భూమా శ్రీనివాసరావు అందిస్తున్న సేవలు

అపూర్వమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ మధుసూదన చారి అన్నారు.

గ్రాఫాలజిస్ట్‌గా గుర్తింపు పొందిన సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీలు పొందిన శ్రీనివాసరావు, గ్రాఫాలజీలో పలు డిప్లొమా కోర్సులు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణలను పూర్తి చేశారని పేర్కొన్నారు. లెక్చరర్, కౌన్సిలర్, సైకాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్‌గా వివిధ బాధ్యతలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

శ్రీనివాస రావుకు లయన్స్ క్లబ్ బెస్ట్ గ్రాఫాలజిస్ట్ అవార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ ఎక్సలెన్స్ అవార్డు గ్రాఫాలజీ అండ్ సోషల్ వర్కర్ అవార్డును అందుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి