నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్
నల్లగొండ: జాతీయ స్థాయి కబడ్డీలో ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించిన ఆకాంక్ష హైస్కూల్ విద్యార్థి భాను ప్రకాష్కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఘన సత్కారం లభించింది.
School Games Federation of India (SGFI) ఆధ్వర్యంలో 2025లో నిర్వహించిన జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీల్లో భాను ప్రకాష్ అద్భుత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్లు–భవనాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య భాను ప్రకాష్‌ను అభినందించి అవార్డుతో సత్కరించారు. జిల్లా DYSO అక్బర్ అలీ కూడా భాను ప్రకాష్‌ను ప్రత్యేకంగా అభినందించి జాతీయ స్థాయిలో సాధించిన విజయాన్ని ప్రశంసించారు.
భాను ప్రకాష్‌ను జాతీయ స్థాయి క్రీడాకారుడిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన కోచ్ ఆవుల చంద్రశేఖర్ను కూడా ఈ సందర్భంగా అభినందించారు.
భాను ప్రకాష్ విజయం అతని కృషి, పట్టుదలతో పాటు కోచ్ ఆవుల చంద్రశేఖర్ అందించిన సమర్థవంతమైన శిక్షణకు నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నల్లగొండ జిల్లా పేరు నిలబెట్టిన భాను ప్రకాష్‌ను ఆకాంక్ష హైస్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.





