శనివారం17 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX74,729+3.90%
NIFTY23,146+3.50%
22K₹1,36,553/10g-0.05%
భాషలు

తాజా వార్తలు

వన మహోత్సవంలో ఆర్యవైశ్యుల సందడి

The Arya Vysya community in Halia and Anumula mandal celebrated Vana Mahotsavam with cultural events, a grand feast, and the swearing-in of newly elected executive bodies.

nagendra1 September 2026, 2:12 PM62 చూసులుtrinetnews.com
వన మహోత్సవంలో ఆర్యవైశ్యుల సందడి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్: విశ్వనాథ్

హాలియా, ట్రైనెట్ న్యూస్: అనుముల మండల ఆర్యవైశ్య సంఘం, హాలియా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆటపాటలు, నృత్యాలు, చిన్నారుల ఆటలు, మహిళల కోలాటాలు, యువకుల సందడితో కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరికీ పసందైన విందు ఏర్పాటు చేశారు.

వన మహోత్సవం అనంతరం నూతనంగా ఎన్నికైన అనుముల మండల ఆర్యవైశ్య సంఘం, హాలియా పట్టణ ఆర్యవైశ్య సంఘం, అనుముల మండల యువజన సంఘం, హాలియా పట్టణ యువజన సంఘం కార్యవర్గాలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన కార్యవర్గాలతో జిల్లా అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.

అనుముల మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పోలా సైదులు, ప్రధాన కార్యదర్శిగా కొండూరు గణేష్, కోశాధికారిగా కట్ట మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు.

హాలియా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా మంచుకొండ ప్రభాకర్, కార్యదర్శిగా మంచుకొండ శ్రీను, కోశాధికారిగా ఆకీ నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.

అనుముల మండల యువజన సంఘం అధ్యక్షులుగా బచ్చు వెంకన్న, కార్యదర్శిగా సముద్రాల అరవింద్, కోశాధికారిగా తేలప్రోలు ఉదయ్ కుమార్ ప్రమాణం చేశారు. హాలియా పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా బచ్చు సతీష్, కార్యదర్శిగా గందే మహేష్, కోశాధికారిగా ఊరే వినోద్ బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్, కోశాధికారి జైనాల వెంకటేశ్వర్లు, అదనపు ప్రధాన కార్యదర్శి తేలుకుంట్ల జానయ్య, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు నాంపల్లి భాగ్యలక్ష్మి, గుండా నాగరాజు, నల్లగొండ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు వజ్రతేజ, రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ చైర్మన్ చిట్టిప్రోలు యాదగిరి, అనుముల మండల ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు వీరమల్ల కృష్ణయ్య, మిట్టపల్లి వాసులు, చీదల్ల లింగయ్య, హాలియా పట్టణ గౌరవ అధ్యక్షులు కొత్తమాసు శ్రీనివాస్ మరియు గౌరవ సలహాదారులు కొత్తమాసు కృష్ణమూర్తి, తేలప్రోలు శేఖర్, పాంపాటి శ్రీను, వెంపటి శ్రీను, పాంపాటి పాండయ్య, సముద్రాల శ్రీను, వీరమల్ల శ్రీను, కొండూరు శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

వన మహోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘాల సభ్యులు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఇవి కూడా చదవండి

దేవరకొండ బస్తీలో ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు.. తొలగిన రాకపోకల అడ్డంకి

దేవరకొండ బస్తీలో ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు.. తొలగిన రాకపోకల అడ్డంకి

దేవరకొండ బస్తీలో ట్రాన్స్‌ఫార్మర్‌ తరలింపు దానం నాగేందర్‌ ఆదేశాలతో తొలగిన రాకపోకల అడ్డంకి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని దేవరకొండ బస్తీలో రాకపోకలకు అడ్డంగా ఉన్న విద్యుత్‌ ట్రాన్

మిగతా చదవండి →

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు

రైల్ నిలయంలో భక్తిశ్రద్ధలతో దసరా పూజలు వేడుకల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 16: సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఏడో అంతస్తులో ఉన్న ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్

మిగతా చదవండి →

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి

డాక్టర్‌ దీనదయాళ్‌కు శిష్యుల అక్షర నివాళి జన్మదిన వేడుకల్లో ‘ఏ ట్రిబ్యూట్‌ టు గురు’ పుస్తకం హైదరాబాద్‌, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్‌ 16: ప్రముఖ చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ) శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ దీనదయాళ్‌ జన్మది

మిగతా చదవండి →