దేవదాసు కాళిదాసు మంచి మనసులు వంటి సినిమాల ద్వారా సందేశం ను క్రమ శిక్షణ తో కూడిన జీవితం ద్వారా సమాజానికి ఆదర్శం గా నిలిచిన అక్కినేని నాగేశ్వర రావు చరిత్ర లో నిలిచివుంటారు అని హర్యానా పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొని యాడారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై ప్రముఖ సాంస్కృతిక సంస్థ రస మయి నిర్వహణలో విఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు 102 వ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన పన్నెండు మంది అక్కినేని అభిమానుల కు ఆత్మీయ సత్కారం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న బండారు దత్తాత్రేయ వారిని సత్కరించి మాట్లాడారు అక్కినేని యెన్ టి ఆర్ ఇరువురూ మహా నటులు అని వారికి తను అభిమానుడిని అని తెలిపారు ఇరువురూ సమయ పాలన వృతి పట్ల అంకిత భావం కల వారని చెప్తూ పురస్కారం అందుకున్న వారు వారి ప్రాంతాల్లో అక్కినేని నీ ఆదర్శం గా తీసుకుని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలి అని కోరారు కేంద్ర పూర్వ మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ అక్కినేని అభిమానులు వేరు వేరు ప్రాంతాలనుంచి రప్పించి వారినిద
సత్కరించటం ముదావహం అన్నారు అక్కినేని నీ ఎన్ టి ఆర్ ను ఒకే వేదిక పై పిలిచిన సంస్థ రసమయి మాత్రమే అని కొని యాడారు ఆదాయపు పన్నులు శాఖ పూర్వ .ముఖ్య సంచాలకుడు నరసింహప్ప అధ్యక్తత వహించిన వేదిక పై స్వాగతం పలికిన సంస్థ డాక్టర్ రాము మాట్లాడుతూ గతం లో అక్కినేని సూచించిన వారికి స్వర్ణ కంకణాలు ప్రముఖులకిబహుకరించాం అని గత ఏడాది నుంచి ఆయన అభిమానులను సత్కరిస్తున్నాము అని తెలిపారు ప్రముఖ కవి వి డి రాజ గోపాల్ తదితరులు పాల్గొనగా ఆశా లత వ్యాఖ్యానం సముచితం గా ఉంది తొలుత లలితా సింధూరి శిష్య బృందం డాక్టర్ రాము రచించిన మన అక్కినేని గీతాలు పై కూచిపూడి నాట్య శైలిలో నర్తించారూ





