హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్,సెప్టెంబర్24
గణపతి నవరాత్రుల సందర్భంగా నాచారం మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు, మార్కెట్‌కు వచ్చిన ప్రజలకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అసోసియేషన్ నిర్వాహకులు లక్ష్మణ్, శ్రీధర్ లు మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు, వ్యాపారులు, స్థానికులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.




