చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 :
చిక్కడపల్లి వివేక్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి చిలుకూరి అఖిలేష్, వివేకనర్ అసోసియేషన్ అధ్యక్షుడు చామర్తివాణిస్వర శాస్త్రి , ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ సభ్యులు నర్సింగరావు, రిజిస్ట్రేషన్ మాజీ డిఐజి రామారావు, శ్రీనివాస్ ద్వారకనాథ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ సమపార్జన కోసం ప్రాణాలను అర్పించి దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించిన త్యాగదనులను నేటి యువత మరవోద్దని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం దేశాన్ని తాకట్టు పెడుతున్న ప్రభుత్వాలను మార్చే శక్తి ఓటుకుందని ఆ ఓటు యువశక్తిని అఖిలేష్ పిలుపునిచ్చారు.






