Sunday11 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+0.70%
Languages

Latest News

మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు 8 మంది అరెస్ట్ 6 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీనం

nagendra11 October 2026, 1:58 AM0 viewstrinetnews.com
మైనర్ బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు 8 మంది అరెస్ట్ 6 మొబైల్ ఫోన్లు, ఒక ఆటో స్వాధీనం

Share this story

Share link keeps your language (?lang=)

  • హైదరాబాద్, (ట్రైనెట్ న్యూస్) అక్టోబర్ 10:

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి వ్యభిచార గృహానికి విక్రయించిన దారుణ ఘటనలో 8 మంది నిందితులను టోలిచౌకి పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ వివరాలను వెల్లడించారు.

సెప్టెంబర్ 2న ఆటో డ్రైవర్ షేక్ ఆతిఫ్ (ఏ-1) టోలిచౌకిలో ఓ మైనర్ బాలికను ఆటోలో అపహరించి అత్తాపూర్ వద్ద సనా (ఏ-4), సమ్రీన్ (ఏ-5)లకు అప్పగించాడు.

వారు బాలికకు వసతి భోజనం కల్పిస్తామని ఆశచూపి అత్తాపూర్ పిల్లర్ నంబర్ 200 సమీపంలో వ్యభిచార గృహం నడుపుతున్న సబియా బేగం (ఏ-2)కు రూ.30,000కు విక్రయించారు. ఆ డబ్బును ఆతిఫ్, సనా, సమ్రీన్ పంచుకున్నారు. అయితే సబియా బేగం బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించగా, ఆమె భర్త హాజీమియా (ఏ-3), విటులను తీసుకురావడంలో నదీమ్ (ఏ-6), కైఫుద్దీన్ (ఏ-7), అలీ బిన్ అక్రమ్ (ఏ-8) సహకరించారు. అక్టోబర్ 5న బాలిక అక్కడ నుండి తప్పించుకుని ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, బాధితురాలి ఫిర్యాదు మేరకు టోలిచౌకి పోలీసులు ఫోక్సో, ఐటిపిఏ కేసులు నమోదు చేశారు.

గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేందర్ రెడ్డి, టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫియాజ్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ నాయక్ బృందం దర్యాప్తు చేపట్టి 24 గంటల్లోనే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 6 మొబైల్ ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు

తెలిపారు.

Also read