సోమవారం9 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX81,039+5.36%
NIFTY25,001+5.00%
22K₹1,32,388/10g+0.72%
భాషలు

తాజా వార్తలు

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు! కుంట్లూరులో నకిలీ నోట్ల తయారీ కేంద్రంరూ.6.78 కోట్ల దొంగనోట్లు స్వాధీనం

nagendra4 November 2026, 5:49 AM3 చూసులుtrinetnews.com
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు! కుంట్లూరులో నకిలీ నోట్ల తయారీ కేంద్రంరూ.6.78 కోట్ల దొంగనోట్లు స్వాధీనం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నలుగురు నిందితుల అరెస్టు.. మరో ముగ్గురు పరారీ

ప్రింటర్లు, స్కానర్లు, కట్టింగ్ యంత్రాలు సహా భారీగా సామగ్రి పట్టివేత

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 02:

నకిలీ కరెన్సీ నోట్ల తయారీ ముఠా గుట్టును అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు రట్టు చేశారు. సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో మహేశ్వరం జోన్‌ పరిధిలోని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు, షాద్‌నగర్ ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్‌ఓటీ) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.6 కోట్ల 78 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ డా,తరుణ్ జోషి, మహేశ్వరం జోన్ డీసీపీ డా,కే నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసిపి కెపివి రాజు, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజు, షాద్నగర్ జోన్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ లతో కలిసి ఆయన ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. నవంబర్ 2 వ తేదీ రాత్రి 10.15 గంటల సమయంలో రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రధాన ద్వారం ఎదురుగా, బాలాజీ ఢాబా సమీపంలో జాతీయ రహదారి-65పై వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మారుతి డిజైర్ కారులో నకిలీ నోట్లను తరలిస్తున్న నలుగురు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.6,78,00,000 విలువైన నకిలీ నోట్లతోపాటు నేరానికి ఉపయోగించిన పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు:

1)మడుపోజు కర్ణాకర్ (27) – ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామం.2)చిన్నోళ్ల మాణిక్యరెడ్డి (52) – మెద్చల్-మల్కాజిగిరి జిల్లా,3)చెరుకుపల్లి రత్నాకర్‌రెడ్డి (30) – జగిత్యాల జిల్లా, కోసునూరుపల్లి గ్రామం.4)కరణం అజయ్‌కుమార్ (34) – మహబూబ్‌నగర్ జిల్లా,

పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు

1)జెల్లి వెంకటేష్ (30) – అబ్దుల్లాపూర్‌మెట్ మండలం,సాయినగర్ కాలనీ.2)కుంజ బాలరాజు (46) – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,3)కంపసాటి శ్రీనివాస్ (38) – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో..

సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు నకిలీ కరెన్సీ నోట్లను తయారుచేసి మార్కెట్‌లో చలామణి చేయాలని కుట్ర పన్నారు. తొలుత మొదటి, రెండో, నాలుగో నిందితులు నకిలీ నోట్ల తయారీకి ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం మొదటి, రెండో, నాలుగు, ఐదు, ఆరు నిందితులు మరో పథకం రచించారు.పోలీసు అధికారులుగా నటిస్తూ నకిలీ గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్‌ ఉపయోగించి కస్టమర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తుల నుంచి రూ.2 లక్షలు, రూ.3 లక్షలు చొప్పున మొత్తం రూ.5 లక్షలు వసూలు చేసి తమలో తాము పంచుకున్నారు.

కుంట్లూరులో నకిలీ నోట్ల తయారీ కేంద్రం

అనంతరం మొదటి నుంచి నాలుగో నిందితులు కుంట్లూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నకిలీ కరెన్సీ తయారీ కోసం ప్రింటర్లు, స్కానర్, లామినేషన్ యంత్రం తదితర పరికరాలను సమకూర్చుకున్నారు.మొదటి నిందితుడు అసలైన రూ.500 నోట్లను స్కాన్ చేసి, ఫొటోషాప్ సాఫ్ట్‌వేర్ ద్వారా వాటి చిత్రాలను సవరించి నకిలీ నోట్లు ముద్రించే విధానాన్ని యూట్యూబ్ వీడియోలు, సామాజిక మాధ్యమాల ద్వారా నేర్చుకున్నాడు. ముద్రించిన నోట్లను కత్తిరించి, అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి మార్కెట్‌లో చలామణి చేయాలని ప్రణాళిక రూపొందించారు.

ఒకటి ఇస్తే మూడు.. నాలుగు రెట్లు నకిలీ నోట్లు!

నకిలీ నోట్లను నేరుగా మార్కెట్‌లో చలామణి చేయడంలో విఫలమైన తర్వాత మొదటి, రెండో నిందితులు మరో కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఒక రూపాయి అసలు కరెన్సీకి మూడు లేదా నాలుగు రూపాయల విలువైన నకిలీ నోట్లను ఇస్తామంటూ కస్టమర్లను ఆకర్షించాలని పథకం వేశారు.ముందుగా అసలైన కరెన్సీని చూపించి నమ్మకం కలిగించేవారు. అనంతరం ముఠా సభ్యులు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, నకిలీ తుపాకులతో పోలీసు అధికారులుగా నటిస్తూ, నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాల్లో అక్కడికి చేరుకునేవారు. కస్టమర్లను బెదిరించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ భయపెట్టి వారి వద్ద ఉన్న అసలైన డబ్బును దోచుకుని పరారయ్యేవారు. ఈ క్రమంలో నవంబర్ 1న (టీఎస్ 04 ఈ వై 7291) మారుతి డిజైర్ కారులో నలుగురు వ్యక్తులు నకిలీ కరెన్సీ నోట్లను విజయవాడకు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఎస్ ఐ పి, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులతో కలసి అబ్దుల్లాపూర్ మెట్ లోని రామోజీ ఫిలిం సిటీ ప్రధాన గేటు ముందు బాలాజీ ధాబా సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేయగా కారులోని డిక్కీలో 8 లక్షల విలువైన 1600 నోట్లు కట్టలు, డమ్మీ పిస్టల్, రెండు బాబు సింగ్ వాకీటాకీ సెట్లు గుర్తించారు. హయత్ నగర్ మండలం కుంట్లూరులోని ఒక అద్దె ఇంట్లో సదరు నిందితులు నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడయింది. నిందితులు అసలు కరెన్సీ నోట్ల చిత్రాలు కంప్యూటర్ సాఫ్ట్వేర్, ప్రింటింగ్ పరికరాలను ఉపయోగించి పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. నిందితులు పోలీసు సిబ్బంది గా నటిస్తూ కాబోయే కొనుగోలుదారులను ఇతర వ్యక్తులను బెదిరించడానికి నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, డమ్మీ పిస్టల్స్ వాకీటాకీలను కుంట్లూరు లోని అద్దె ఇంట్లో సోదాలు నిర్వహించి 6.7 కోట్ల విలువైన 134 కట్టల 500 రూపాయల కరెన్సీ నోట్లతో పాటు నకిలీ కరెన్సీ తయారీలో ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 860/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని 178, 179, 180, 181, 318(4), 204, 205, 351(2), 61(2), 3(5) సెక్షన్లతోపాటు భారత వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టంలోని 3, 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

మిగతా చదవండి →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య

మిగతా చదవండి →