Monday9 November 2026Hyderabad

SENSEX81,053+5.38%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,435/10g+0.79%
Languages

Latest News

ఓటు హక్కుపై లక్ష మందికి పైగా యువతకు అవగాహన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 536 ‘యువ సంవాద్’ కార్యక్రమాలు

nagendra7 November 2026, 4:50 AM0 viewstrinetnews.com
ఓటు హక్కుపై లక్ష మందికి పైగా యువతకు అవగాహన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 536 ‘యువ సంవాద్’ కార్యక్రమాలు

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

యువతలో ఎన్నికల అవగాహన, బాధ్యతాయుత ప్రజాస్వామ్య భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ‘వికసిత్ భారత్ యువ సంవాద్: నో యువర్ ఓట్’ దేశవ్యాప్త ప్రచారం ముగిసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్‌ (మై భారత్) ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం 1,00,493 మంది యువతకు చేరువైంది.

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 5 వరకు 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 536 యువ సంవాద్‌లు నిర్వహించారు. మొత్తం 536 మంది యువ ఆదర్శ వ్యక్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా తొలిసారి ఓటు వేయనున్న యువతకు ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలు, పౌర బాధ్యతలపై అవగాహన కల్పించారు.

దేశవ్యాప్తంగా 500 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, విద్యాసంస్థలను చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రచారం చేపట్టారు. చివరి రోజునే 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 123 కార్యక్రమాలు నిర్వహించగా, 22,588 మంది యువత, 123 మంది యువ ఆదర్శ వ్యక్తులు పాల్గొన్నారు.

వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థులతో సంభాషించారు. క్రీడాకారులు తమ అనుభవాలను పంచుకుంటూ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపులో క్రీడల పాత్రను వివరించారు.

చర్చలు, ప్రశ్నోత్తరాలు, క్విజ్‌ల ద్వారా ఎన్నికల విధానాలపై యువత సందేహాలను నివృత్తి చేశారు. విశ్వసనీయ వనరుల ద్వారా సమాచారాన్ని ధ్రువీకరించుకోవడం, విమర్శనాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టిసారించారు. ప్రజాస్వామ్య ప్రతిజ్ఞ, మై భారత్ పోర్టల్‌లో నమోదు కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య