Friday16 October 2026Hyderabad

SENSEX74,707+3.87%
NIFTY23,101+3.30%
HYD 22K₹1,37,240/10g+0.39%
Languages

Latest News

మాదాపూర్‌ ఖానమేట్ లోరూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా, రెవెన్యూ అధికారులు

nagendra16 October 2026, 4:51 AM0 viewstrinetnews.com
మాదాపూర్‌ ఖానమేట్ లోరూ.300 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా, రెవెన్యూ అధికారులు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 15:

మాదాపూర్‌ ఖానామెట్‌ సర్వే నంబర్ 41/14లో ఉన్న రెండు ఎకరాల భూమిని హైడ్రా, రెవెన్యూ అధికారులు రక్షించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.రూ 300 కోట్లు విలువ చేసే భూములు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో రెండు శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ భూమి తమదంటే తమదంటూ గత కొన్ని రోజులుగా రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. స్థలంలో షీట్లు ఏర్పాటు చేసి భూమిని స్వాధీనం చేసుకునేందుకు ఇరు వర్గాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తహసిల్దార్ మహిపాల్ రెడ్డి కబ్జాదారుల కు నోటీస్ ఇచ్చి భూమి స్వాధీనం చేసుకొనేందుకు ఆర్డర్ పాస్ చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. కోట్లాది రూపాయల విలువైన భూమి విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారుల చర్యలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.1954–55 ఖస్రా పహాణీ ప్రకారం ఖానామెట్‌లో పాత సర్వే నంబర్‌ 55లో 286 ఎకరాల భూమి పోరంబోకు సర్కారీగా నమోదైనట్లు ప్రభుత్వం వాదిస్తోంది. తదుపరి సర్వేలో కొత్త సర్వే నంబర్‌ 41గా మారి, వసూల్‌ బాకీ రికార్డు ప్రకారం 252.24 ఎకరాలుగా నమోదైనట్లు తెలిపారు. 41/13/Aలో లో ఉన్న భూమిని కూల్చివేయడం ఏమిటని కబ్జాదారులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. వివాదాస్పద ఫెన్సింగ్‌ స్థలం సర్వే నంబర్‌ 41/14లోని ప్రభుత్వ భూమిగా రెవెన్యూ అధికారులు ఆర్డర్ పాస్ చేయడంతో. ఈ రెండు సర్వే నంబర్ల మధ్య భౌగోళిక హద్దులు ఎక్కడున్నాయి? సంస్థ సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న స్థలం, క్షేత్రస్థాయిలో ఫెన్సింగ్‌ వేసిన స్థలం ఒకటేనా? దీనికి సమాధానం అధికారిక సర్వే స్కెచ్‌, ఎఫ్ఎంబి జాయింట్‌ సర్వే నివేదికలతోనే తేలుతుంది.41/13/Aపై హక్కులు కోరుతున్న సంస్థ సమర్పించిన డాక్యుమెంట్లను బోగస్ గా తేల్చారు.గతంలో ఇచ్చిన నోటీసులపై అక్రమ దారులు హైకోర్టును ఆశ్రయించారు.

ఖానామెట్‌ భూమిపై హైకోర్టును ఆశ్రయించిన జీఏఆర్ డెవలపర్స్‌

ఖానామెట్‌ లో ఉన్న భూమికి సంబంధించి జీఏఆర్ డెవలపర్స్‌ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. సర్వే నంబర్‌ 41/13ఏలో ఉన్న 5,421 చదరపు గజాల భూమిపై అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సంస్థ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు.2025లో జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ నంబర్‌ B/630/2025ను రద్దు చేయాలని జీఏఆర్‌ డెవలపర్స్‌ కోరింది. ఆ ప్రొసీడింగ్స్‌ చట్టవిరుద్ధమైనవని, ఏకపక్షంగా ఉన్నాయని, అధికార పరిధిని మించి జారీ చేశారని పిటిషనర్‌ వాదించారు.ఈ కేసులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, శేరిలింగంపల్లి మండల తహసీల్దార్‌, హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)లను ప్రతివాదులుగా చేర్చారు.

Also read