Monday9 November 2026Hyderabad

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
Languages

Latest News

పశువుల గాలికుంటు వ్యాధి నివారణకు ‘వజ్ర–సాట్’ కసరత్తు 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 83 మంది ప్రతినిధుల భాగస్వామ్యం

nagendra7 November 2026, 4:45 AM0 viewstrinetnews.com
పశువుల గాలికుంటు వ్యాధి నివారణకు ‘వజ్ర–సాట్’ కసరత్తు 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 83 మంది ప్రతినిధుల భాగస్వామ్యం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

పశువుల్లో గాలికుంటు వ్యాధికి కారణమయ్యే ఎఫ్‌ఎండీ శాట్–1 వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత పెంపునకు నిర్వహించిన ‘వజ్ర–సాట్’ జాతీయ టేబుల్‌టాప్ కసరత్తు బెంగళూరులో ముగిసింది. కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, ఐసీఏఆర్–జాతీయ పశువైద్య వ్యాధి విజ్ఞాన, వ్యాధి సమాచార సంస్థ సంయుక్తంగా నవంబర్ 4, 5 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

‘ముందుగా గుర్తిద్దాం.. వేగంగా నిర్ధారిద్దాం.. సమష్టిగా కట్టడి చేద్దాం’ అనే ఇతివృత్తంతో జరిగిన కసరత్తులో 25 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలు, జాతీయ సంస్థలకు చెందిన 83 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖలు, పశువైద్య ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు, టీకా తయారీ సంస్థలు, రక్షణ, సరిహద్దు భద్రతా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

భారత్‌లో ఇప్పటివరకు ఎఫ్‌ఎండీ శాట్–1 రకం నమోదుకాలేదు. అయితే ఆఫ్రికా వెలుపల పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించిన నేపథ్యంలో పశుసంపద, రైతుల జీవనోపాధిని కాపాడేందుకు ముందస్తు సన్నద్ధత చర్యగా ఈ కసరత్తు చేపట్టారు.

ఊహాత్మక వ్యాధి వ్యాప్తి పరిస్థితుల ఆధారంగా సత్వర గుర్తింపు, ప్రయోగశాల నిర్ధారణ, వ్యాధి వ్యాప్తిపై పరిశోధన, పశువుల తరలింపు నియంత్రణ, అత్యవసర టీకాల సన్నద్ధతపై చర్చించారు. ప్రజలకు సరైన సమాచారం అందించడం, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టిసారించారు.

ప్రారంభ కార్యక్రమంలో పశుసంవర్ధక కమిషనర్ డాక్టర్ నవీనా బి.ఎం. ముందస్తు సన్నద్ధత ప్రాధాన్యాన్ని వివరించారు. ముగింపు సమావేశానికి అధ్యక్షత వహించిన అదనపు కార్యదర్శి రామశంకర్ సిన్హా జాతీయ, రాష్ట్రస్థాయి సన్నద్ధతతో పాటు ప్రాంతీయ ప్రయోగశాలల నిర్ధారణ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.

వీర్యోత్పత్తి కేంద్రాలు, వీర్య బ్యాంకులను గాలికుంటు వ్యాధి రహిత ప్రత్యేక యూనిట్లుగా నిర్వహించడంపైనా ప్రత్యేక సాంకేతిక సమావేశం జరిగింది. విలువైన పశు జన్యు వనరుల పరిరక్షణ, సురక్షిత పశువాణిజ్యానికి తోడ్పడే చర్యలపై చర్చించారు.

Also read

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

Read more →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య