Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,076+5.41%
NIFTY24,997+4.98%
HYD 22K₹1,32,520/10g+0.82%
भाषाएँ

Latest News

బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకున్న 21 వేల మందికి పైగా భక్తులు తవాంగ్ మఠంలో నవంబర్ 7 వరకు దర్శనానికి అవకాశం

nagendra7 November 2026, 4:41 AM0 व्यूtrinetnews.com
బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకున్న 21 వేల మందికి పైగా భక్తులు తవాంగ్ మఠంలో నవంబర్ 7 వరకు దర్శనానికి అవకాశం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 06:

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ మఠంలో ప్రదర్శనకు ఉంచిన శాక్యముని బుద్ధుడి పవిత్ర అవశేషాలను ఇప్పటివరకు 21 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. తవాంగ్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువులు, భిక్షుణులు, భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. నవంబర్ 7 వరకు ప్రజలకు దర్శన అవకాశం కల్పించనున్నారు.

పదమూడేళ్ల విరామం తర్వాత బుద్ధుడి పవిత్ర అవశేషాలను అరుణాచల్‌ప్రదేశ్‌కు తీసుకురావడం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది. న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియం నుంచి తీసుకొచ్చిన ఈ అవశేషాలు 1898లో ఉత్తరప్రదేశ్‌లోని పిప్రహ్వాలో వెలుగుచూశాయి. బౌద్ధ చరిత్ర, పురావస్తు పరిశోధనల్లో వీటికి విశిష్ట స్థానం ఉంది.

ఈ సందర్భంగా తవాంగ్ మఠంలో రెండు ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య ఆధ్వర్యంలోని ప్రదర్శన పవిత్ర అవశేషాల ఆవిష్కరణ, చారిత్రక ప్రాధాన్యాన్ని వివరిస్తోంది. జాతీయ మ్యూజియం రూపొందించిన మరో ప్రదర్శన బౌద్ధ చరిత్ర, కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేస్తోంది.

తవాంగ్ అనంతరం నవంబర్ 8 నుంచి 13 వరకు బోమ్‌డిలాలోని టీజీఎల్ మఠం, నవంబర్ 14 నుంచి 20 వరకు నామ్‌సాయ్‌లోని గోల్డెన్ పగోడాలో పవిత్ర అవశేషాలను దర్శనార్థం ఉంచనున్నారు. నవంబర్ 21న తిరిగి న్యూఢిల్లీ జాతీయ మ్యూజియానికి తరలించనున్నారు.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య, అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. బౌద్ధ వారసత్వ పరిరక్షణతో పాటు శాంతి, కరుణ, జ్ఞానం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటే బుద్ధుడి బోధనలను ప్రజలకు చేరువ చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య