Thursday15 October 2026హైదరాబాద్

SENSEX73,679+1.66%
NIFTY22,902+1.70%
HYD 22K₹1,35,801/10g-0.57%
भाषाएँ

Latest News

2026వ ఏడాదికి డాక్టర్‌ ఏపిజే అబ్దుల్‌ కలాం అవార్డును గెలుచుకున్న ప్రముఖ టాలీవుడ్‌ నటుడు ఆలీ...

nagendra15 October 2026, 2:18 AM0 व्यूtrinetnews.com
2026వ ఏడాదికి డాక్టర్‌ ఏపిజే అబ్దుల్‌ కలాం అవార్డును గెలుచుకున్న ప్రముఖ టాలీవుడ్‌ నటుడు ఆలీ...

Share this story

Share link keeps your language (?lang=)

టాలీవుడ్‌లో ఎన్నో అవార్డులు రివార్డులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ఆలీ. కమెడియన్‌గా క్యారెక్టర్‌ యాక్టర్‌గా టీవి హోస్ట్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకుని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఆలీ. 1100 సినిమాలకు పైగా నటించిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్‌ నటునిగా ఫుల్‌ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రతిభను గుర్తించిన అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ మరియు పర్వాజ్‌ మీడియా గ్రూప్‌ వారు 2026 సంవత్సరానికిగాను బిగ్‌ ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఆలీకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిల్లీలో జరిగిన అవార్డుల వేడుకలో తెలుగు నటుడైన ఆలీ మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ సహాయమంత్రి రామ్‌దాస్‌ అథవాలే చేతుల మీదుగా ఈ ప్రిస్టేజియస్‌ డాక్టర్‌ ఏపిజే అబ్దుల్‌ కలాం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తనను వరించటం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు ఆలీ. ఈ కార్యక్రమంలో సినిమా రంగానికే కాకుండా అనేక విభాగాల్లో పనిచేసిన నిపుణులకు అవార్డులను అందచేశారు అవార్డుల కమిటీవారు. నన్ను ఈ అవార్డుకి సెలెక్ట్‌ చేసిన కమిటీకి నా ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు ఆలీ.

यह भी पढ़ें