Thursday22 October 2026హైదరాబాద్

SENSEX73,468-1.14%
NIFTY22,745-1.10%
HYD 22K₹1,33,257/10g-1.35%
भाषाएँ

Latest News

గనుల పునర్వినియోగానికి ‘సువికల్ప్’ బాట సీసీఓ సాధనానికి స్కోచ్ గోల్డ్ అవార్డు–2026

nagendra22 October 2026, 2:01 AM2 व्यूtrinetnews.com
గనుల పునర్వినియోగానికి ‘సువికల్ప్’ బాట సీసీఓ సాధనానికి స్కోచ్ గోల్డ్ అవార్డు–2026

Share this story

Share link keeps your language (?lang=)

పర్యావరణ పునరుద్ధరణ, స్థానిక ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

మూతపడిన బొగ్గు గనులను ఉత్పాదక ఆస్తులుగా మార్చేందుకు కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ (సీసీఓ) అభివృద్ధి చేసిన ‘సువికల్ప్’ సాధనానికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. సమాచార ఆధారిత నిర్ణయాలతో నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచే విభాగంలో ఈ సాధనం సెప్టెంబర్ 26న స్కోచ్ గోల్డ్ అవార్డు–2026 అందుకుంది.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని సీసీఓ శాస్త్రీయ పద్ధతుల్లో గనుల మూసివేత, తవ్వకాల అనంతరం భూముల సుస్థిర పునర్వినియోగానికి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సొంతంగా రూపొందించిన ‘సువికల్ప్’ ద్వారా ఆయా గనులకు అనువైన పునర్వినియోగ ప్రాజెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. సాంకేతిక, పర్యావరణ, సామాజిక, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్టులను విశ్లేషించి, వాటికి ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారిస్తుంది.

ప్రాజెక్టు ఎంపిక అనంతరం దాని అమలుకు ‘ప్రిజమ్’ నమూనా మార్గదర్శకత్వం అందిస్తుంది. ప్రాజెక్టు ఆలోచనలు, అమలు విధానాలు, విజయవంతమైన ఉదాహరణలు, నమూనా సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, టెండర్ పత్రాలతోపాటు సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న సంస్థల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది.

గనుల మూసివేత, పునర్వినియోగంపై అవగాహన పెంచేందుకు సీసీఓ ‘సువికల్ప్ సంవాద్’ పేరిట జాతీయ వెబినార్ సిరీస్‌ను కూడా నిర్వహించింది. మొత్తం 12 అంశాలపై జరిగిన ఈ సదస్సుల్లో బొగ్గు సంస్థలు, ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, విద్యాసంస్థలు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.

స్థానిక ప్రజల భాగస్వామ్యం, పర్యాటక అభివృద్ధి, జీవనోపాధి అవకాశాలు, నిధుల సమీకరణ, ప్రాజెక్టు నిర్వహణ విభాగాల ఏర్పాటు, నిరుపయోగంగా ఉన్న గని ఖాళీ ప్రదేశాల వినూత్న వినియోగం తదితర అంశాలపై చర్చించారు. గనుల పరివర్తనకు సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను పంచుకున్నారు.

గనుల మూసివేతను కేవలం నిబంధనల అమలుకే పరిమితం చేయకుండా పర్యావరణ పునరుద్ధరణ, ఉపాధి కల్పన, స్థానిక సమాజ అభివృద్ధి, ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు అనుసంధానించేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి. మూతపడిన బొగ్గు గనులను ఉపయోగకరమైన ఆస్తులుగా తీర్చిదిద్ది, ఆయా ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధిని సాధించాలన్న బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యానికి ఇవి దోహదపడుతున్నాయి.

यह भी पढ़ें