Monday9 November 2026హైదరాబాద్

SENSEX81,033+5.35%
NIFTY25,004+5.01%
HYD 22K₹1,32,397/10g+0.76%
भाषाएँ

Latest News

విశాఖలో భారత్‌–అమెరికా ‘టైగర్‌ ట్రయంఫ్‌–2026’ ప్రారంభం విపత్తు సహాయక చర్యల్లో సమన్వయమే లక్ష్యం.. తొలిసారిగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ భాగస్వామ్యం

nagendra4 November 2026, 5:01 AM1 व्यूtrinetnews.com
విశాఖలో భారత్‌–అమెరికా ‘టైగర్‌ ట్రయంఫ్‌–2026’ ప్రారంభం విపత్తు సహాయక చర్యల్లో సమన్వయమే లక్ష్యం.. తొలిసారిగా ఎన్‌డీఆర్‌ఎఫ్‌ భాగస్వామ్యం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 03:

భారత్‌–అమెరికా త్రివిధ దళాల సంయుక్త మానవతా సహాయం, విపత్తు సహాయక విన్యాసం ‘టైగర్‌ ట్రయంఫ్‌–2026’ ఐదో ఎడిషన్‌ సోమవారం విశాఖపట్నంలోని మారిటైమ్‌ వార్‌ఫేర్‌ సెంటర్‌లో ప్రారంభమైంది. భారీ విపత్తుల సమయంలో ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సమన్వయం, సంయుక్త ప్రణాళిక, కలిసి పనిచేసే సామర్థ్యాన్ని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం.

ఈ ఏడాది విన్యాసాన్ని ‘టేబుల్‌టాప్‌ ఎక్సర్‌సైజ్‌’ రూపంలో నిర్వహిస్తున్నారు. ఊహాత్మక విపత్తు పరిస్థితుల ఆధారంగా సహాయక చర్యల ప్రణాళిక, బాధ్యతల సమన్వయంపై ఇందులో కసరత్తు చేస్తారు. ప్రారంభ కార్యక్రమానికి భారత తూర్పు నౌకాదళ ఫ్లీట్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ విశాల్‌ బిష్ణోయ్‌, అమెరికా పసిఫిక్‌ ఫ్లీట్‌ వైస్‌ కమాండర్‌ రియర్‌ అడ్మిరల్‌ జోక్విన్‌ జె. మార్టినెజ్‌ డి పినిల్లోస్‌ అధ్యక్షత వహించారు.

భారత్‌ తరఫున నౌకాదళంలోని వివిధ సముద్ర కార్యకలాపాల నిపుణులు, సైన్యానికి చెందిన భూతల బలగాలు, వైమానిక దళంలోని పలు విభాగాల ప్రతినిధులు, త్రివిధ దళాల ప్రత్యేక బలగాల సిబ్బంది పాల్గొంటున్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందం తొలిసారిగా ఈ విన్యాసంలో భాగస్వామ్యం కానుంది.

అమెరికా తరఫున ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, మెరైన్‌ కోర్‌ ప్రతినిధులతోపాటు అంతరిక్ష, సైబర్‌, వైద్య, పేలుడు పదార్థాల నిర్వీర్య విభాగాల నిపుణులు పాల్గొంటున్నారు.

భారీ విపత్తుల సమయంలో వివిధ రంగాలకు చెందిన దళాలు సమష్టిగా స్పందించేందుకు అవసరమైన ప్రణాళికలు, కార్యాచరణ విధానాలపై ఈ విన్యాసం దృష్టి సారిస్తోంది. భారత్‌–అమెరికా మధ్య విస్తరిస్తున్న రక్షణ భాగస్వామ్యానికి, సముద్ర వ్యూహాత్మక ప్రయోజనాల్లో పెరుగుతున్న సహకారానికి ఇది ప్రతిబింబంగా నిలుస్తోంది.

यह भी पढ़ें

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజాపాలన ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లోని 12వ వార్డులో ఘనంగా ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు.. లబ్ధిదారుల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు

और पढ़ें →

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానమే నల్గొండ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: కల్వకుంట్ల కవిత డిండి రిజర్వాయర్ వద్ద నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజెంటేషన్.. ఏదుల నుంచి డిండికి నీళ్లు తీసుకురావడం సాధ్యం కాదని వ్యాఖ్య