Sunday11 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

రక్షణ రంగంలో స్వావలంబనతో పాటు అంతర్జాతీయ సహకారం కీలకం తరంగ్‌ శక్తి–2026లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

nagendra11 October 2026, 1:35 AM0 viewstrinetnews.com
రక్షణ రంగంలో స్వావలంబనతో పాటు అంతర్జాతీయ సహకారం కీలకం తరంగ్‌ శక్తి–2026లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

Share this story

Share link keeps your language (?lang=)

న్యూ ఢిల్లీ, అక్టోబరు 10 (ట్రైనెట్ న్యూస్):

ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కొనేందుకు రక్షణ రంగంలో స్వావలంబన, సాంకేతిక ఆవిష్కరణలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ వైమానిక స్థావరంలో శనివారం నిర్వహించిన ‘తరంగ్‌ శక్తి–2026’ బహుళ దేశాల వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న సిబ్బందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

“దేశాలు వేరు.. విమానాలు వేరు.. అనుభవాలు వేరు.. కానీ ఆకాశం ఒక్కటే. ఇదే తరంగ్‌ శక్తి సందేశం” అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో సైనిక శక్తిని నిర్దేశించేది పరిస్థితులను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, చర్యలు చేపట్టడంలో చూపే వేగమేనని తెలిపారు. రాబోయే కాలంలో రక్షణ సంబంధాలు ఆయుధ వ్యవస్థలకే పరిమితం కాకుండా సాంకేతికత, పరస్పర విశ్వాసంపై ఆధారపడతాయని అన్నారు.

భారత వైమానిక దళం ఆధ్వర్యంలో సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 12 వరకు జరుగుతున్న ఈ రెండో విడత విన్యాసాల్లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, శ్రీలంక, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, అమెరికా వైమానిక దళాలు పాల్గొంటున్నాయి. మరో 32 దేశాలు పరిశీలకులుగా హాజరయ్యాయి.

విన్యాసాలను విజయవంతంగా నిర్వహిస్తున్న భారత వైమానిక దళాన్ని, సంబంధిత సంస్థలు, సిబ్బందిని రక్షణ మంత్రి అభినందించారు. వివిధ దేశాల భాగస్వామ్యం వృత్తిపరమైన అవగాహనను, కార్యాచరణ సహకారాన్ని బలోపేతం చేసిందన్నారు. పాల్గొన్న బృందాలు విలువైన అనుభవాలతో పాటు భారత సామర్థ్యాలు, దృక్పథంపై మరింత అవగాహనతో స్వదేశాలకు తిరిగి వెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also read