బాలాపూర్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 17: జనహిత సేవా ట్రస్ట్, ఆశ్రిత, రెయిన్బో హోమ్, కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్లోని రోషన్ దౌలా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బాలాపూర్ ఎస్ఐ మహమ్మద్ సోహైల్ శిబిరాన్ని ప్రారంభించారు. పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
శిబిరంలో కిమ్స్ ఆస్పత్రి వైద్యులు 150 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సలహాలతో పాటు మందులు అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం. శ్రీనివాస్ ఒంటినొప్పులతో బాధపడుతున్న వారికి వ్యాయామ పద్ధతులను వివరించి, ప్రదర్శించారు.
కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు మల్లోజు రవి, కార్యదర్శి డి. ప్రకాష్, కోశాధికారి జె. శివకుమార్, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధి నర్సింహమూర్తి, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఎస్. నాగరాజు, ప్రోగ్రాం మేనేజర్ వి. పర్వతాలు, సిబ్బంది హేమలత, అనిత, జమున, వీరబాబు, శివమ్మ, అంగన్వాడీ టీచర్ రాధిక, జనహిత క్యాంపు కోఆర్డినేటర్ బి. నర్సింగ్రావు పాల్గొన్నారు.





