Sunday25 October 2026Hyderabad

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,645/10g-3.25%
Languages

Latest News

కూచిపూడి గ్రేడ్ పరీక్షలకు 120 మంది విద్యార్థులు

nagendra25 October 2026, 3:14 AM0 viewstrinetnews.com
కూచిపూడి గ్రేడ్ పరీక్షలకు 120 మంది విద్యార్థులు

Share this story

Share link keeps your language (?lang=)

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 24:

రుద్ర కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో అఖిల భారత కళా సాధన పరిషత్ నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య విభాగం–2026 ద్వైవార్షిక గ్రేడ్ పరీక్షలు శనివారం హైదరాబాద్‌లోని శ్రీ అర్ధనారీశ్వర కూచిపూడి డాన్స్ అకాడమీలో విజయవంతంగా జరిగాయి. వివిధ స్థాయిల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు నాట్య గురువులు రాణి ప్రియ, ఎస్. భార్గవి, టి. సాయిప్రియల శిష్యులు సుమారు 120 మంది హాజరై తమ నాట్య ప్రతిభను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా రుద్ర కళాక్షేత్రం వ్యవస్థాపకులు మాచిరాజు రాజేష్ మాట్లాడుతూ.. కూచిపూడి వంటి శాస్త్రీయ కళలను చిన్ననాటి నుంచే క్రమబద్ధమైన శిక్షణతో అభ్యసించడం ఎంతో ముఖ్యమన్నారు. పరీక్షలు మార్కులు, గ్రేడ్‌లకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నిరంతర సాధన, నాట్య పరిజ్ఞానం, వేదికపై ప్రదర్శించే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

కళను నేర్చుకోవడం నిరంతర సాధనతో కూడుకున్న ప్రక్రియ అని రాజేష్ పేర్కొన్నారు. గురువుల వద్ద నేర్చుకున్న అంశాలను విద్యార్థులు క్రమం తప్పకుండా సాధన చేస్తూ, పరీక్షల ద్వారా తమ అభ్యాసాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. కూచిపూడి కళను భవిష్యత్ తరాలకు అందించడంలో క్రమబద్ధమైన పరీక్షా విధానం ఉపయోగపడుతుందన్నారు.

పరీక్షల నిర్వహణలో శ్రీ అర్ధనారీశ్వర కూచిపూడి డాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు గెల్లంకి రాణి ప్రియ, సిబ్బంది, స్థానిక నాట్య గురువులు సమన్వయంతో వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూచిపూడి గ్రేడ్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, విద్యార్థులకు ప్రామాణికమైన శాస్త్రీయ నాట్య విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Also read