హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 5: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 5న ‘సువర్ణ రాగ మాలికలు’ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ‘మధుర భావాల సుమమాల… మనసులో పూచే ఈ వేళ’ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎన్నార్ నటించిన చిత్రాల మధుర గీతాలను ఆలపించారు.
వీణాపాణి కళావిలయం, మాగ్నిఫిసెంట్ మ్యూజిక్ ఆధ్వర్యంలో డా. జి.ఎం. శ్రీదేవి సమర్పణగా ఈ కార్యక్రమం జరిగింది. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ గుండవరపు హనుమంతరావు కళావేదికలో సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ప్రేక్షకులకు ఏఎన్నార్ చిత్రాల మధుర గీతాలను మరోసారి ఆస్వాదించే అవకాశం కల్పించారు.





