Monday12 October 2026హైదరాబాద్

SENSEX72,268-1.09%
NIFTY22,504-1.19%
HYD 22K₹1,38,736/10g+2.02%
भाषाएँ

Latest News

బహుజన తెలంగాణ కోసం బతుకమ్మ మరో ఉద్యమ స్వరూపం కావాలి: కవిత ఉస్మానియాకు రూ.1,000 కోట్లు సాధించే వరకు పోరాడుతాం

nagendra12 October 2026, 2:30 AM0 व्यूtrinetnews.com
బహుజన తెలంగాణ కోసం బతుకమ్మ మరో ఉద్యమ స్వరూపం కావాలి: కవిత ఉస్మానియాకు రూ.1,000 కోట్లు సాధించే వరకు పోరాడుతాం

Share this story

Share link keeps your language (?lang=)

ఈవీఎంలు తొలగించి బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 11: బహుజన తెలంగాణ నిర్మాణం కోసం బతుకమ్మ మరోసారి ఉద్యమ స్వరూపం దాల్చాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పేదింటి బిడ్డలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలని, యూనివర్సిటీలు నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక స్ఫూర్తిగా నిలిచిందని, ఇప్పుడు సమానత్వం, స్వేచ్ఛ, అన్ని వర్గాలకు అధికారంలో ప్రాతినిధ్యం కల్పించేందుకు మరోసారి ఉద్యమ సాధనంగా మారాలని కవిత అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిందని గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి ఆరు నెలలు గడిచినా నిధులు విడుదల కాలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి ఆ నిధులను ముక్కుపిండి అయినా సాధిస్తామని అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపకుల కొరత, హాస్టళ్లలో కనీస సౌకర్యాల లేమిపై ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేశాయని పేర్కొంటూ, గతంలో బీఆర్ఎస్‌లో భాగస్వామిగా ఉన్నందుకు మరోసారి క్షమాపణలు చెబుతున్నానన్నారు.

ఎన్నికల వ్యవస్థ మారాలి**

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను మార్చడం మాత్రమే పరిష్కారం కాదని, మొత్తం ఎన్నికల వ్యవస్థలో మార్పులు రావాలని కవిత అన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, యువత నాయకులుగా ఎదిగేందుకు యూనివర్సిటీలు వేదికలు కావాలని సూచించారు. రాహుల్ గాంధీ ప్రకటించిన రోహిత్ వేముల చట్టం, జాబ్ క్యాలెండర్ హామీల అమలుపై కూడా ప్రశ్నించారు. విద్యార్థులు ఫాలోవర్లుగా కాకుండా నాయకులుగా ఎదగాలని, పేద కుటుంబాల పిల్లలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేలా యూనివర్సిటీల్లో స్వేచ్ఛాయుత ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత పిలుపునిచ్చారు.

यह भी पढ़ें