బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సంపాదకీయం

"తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పటివరకు ఎదుటి వారి బాధ తేలికగానే కనిపిస్తుంది."

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:22 AM8 వీక్షణలుtrinetnews.com
"తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పటివరకు ఎదుటి వారి బాధ తేలికగానే కనిపిస్తుంది."

ట్రైనెట్ న్యూస్ శశి మోహన కాంతి కిరణం...

మానవ జీవితం సుఖదుఃఖాల సమాహారం. సుఖాన్ని పంచుకోటానికి ఎంతోమంది ఉంటారు. కానీ ఎదుటివారి కష్టం చూడటానికి చాలా చిన్నదిగా, తేలికగా, ఈజీగా పరిష్కారం అయ్యేలాగా కనపడుతుంది. కానీ అదే పరిస్థితి మన జీవితంలో మనకు ఎదురైనప్పుడు దాని యొక్క తీవ్రత లోతు మనకు అర్థమవుతుంది.

మనుషులు రకరకాలు. కొందరి స్వభావములో అజ్ఞానం, అహంకారం దాగి ఉంటాయి. వారికి ఇతరుల సమస్యలు తేలికగా ,ఎగతాళిగా కనపడతాయి. ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసినప్పుడు ఖర్చులు తగ్గించుకుంటే చాలు కదా అని సలహా ఇస్తాము. కానీ ఆ కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి , సమాజంలో వారు పడుతున్న అవమానాలు మనకి కనపడవు మనకు అనుభవం లేకపోవడం వల్ల వారి బాధను కేవలం పైపైన మాత్రమే అంచనా వేయగలుగుతాం .

కానీ జీవితంలో మనకు నిజంగా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్నప్పుడు కలిగే లోటు, అనారోగ్యం కలిగినప్పుడు కలిగే నిస్సహాయత, నమ్మి మోసపోయేటప్పుడు వచ్చే గుండె కోత అనుభవాలతో రావాలే గాని, మాటలతో రాదు.

నిప్పు కాలితేగాని దాని వేడి మనకి తెలియదు. అలాగే కష్టం వస్తే గాని దాన్ని బాధ తెలియదు.

ఎదుటివారికి నీతులు చెప్పటం ఎంత తేలికో అప్పుడు అర్థమవుతుంది.

ఈనాడు ఈ ఆధునిక యుగంలో సాంకేతికత కూడా హేళనకు వేదిక అయ్యింది. మీడియాలో చూపిస్తున్న ఎన్నో విషయాలను ఒక వార్త లాగానో వినోదంలాగా చూస్తున్నారే తప్ప అందులో ఉన్న వాస్తవాలను గ్రహించడం లేదు. అవన్నీ కథలుగా కనపడుతున్నాయి.

ఈ రోజుల్లో ఎదుట మనిషి కష్టాల్లో ఉన్నప్పుడో ,సమస్యల్లో ఉన్నప్పుడో చూసే ప్రతి ఒక్కడు ఉచిత సలహా ఇస్తాడు. ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది తమ తెలివితేటలు ప్రదర్శిస్తారు. కానీ సమస్యలో ఉన్న వ్యక్తికి ఒక రకమైన అయోమయం స్థితి ఉంటుందని, ఆ సమయంలో బుర్ర పని చేయదని గ్రహించరు.

ఇంకా కొన్ని కుటుంబాలలో ఆరోగ్యం బాగోలేక అత్త పడుకుంటే కోడలికి కోపం ,కోడలు పడుకుంటే అత్తలకి కోపం కట్టలు తెంచుకొని బయటపడుతుంది. ఎదుటివారు నాటకాలు ఆడుతున్నారని అపోహ పడటమే కాక వారిని దెప్పి పొడుస్తారు.

ఇంకా కొన్ని చోట్ల ఎవరికైనా బాగా లేకపోతే... మరీ బడాయమ్మా. చిన్నదానికే పెద్ద హంగామానా. ఇంత మందు తాగితే తగ్గిపోతుంది, టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అని అంటారు. కానీ తమకు వచ్చేసరికి హంగామా చేసేస్తారు.

మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రతి విషయాన్ని తన కోణంలో నుంచి కాకుండా ఎదుటివారి కోణంలో నుండి చూడాలి. ఇతరుల సమస్యలను చూసి ఎగతాళి చేయడం మంచిది కాదు.

కష్టాలలో ఉన్నవారికి ఏమి చేయకపోయినా కనీసం ధైర్యమైనా చెప్పాలి. వారికి సపోర్టుగా భుజం మీద చేయి వేసి భరోసానివ్వాలి. ఈ జీవితం చక్రంలాంటిది. పైది క్రిందికి, క్రిందిది పైకి తిరుగుతూ ఉంటుంది. జీవితం కూడా అంతే పరిస్థితులు ఒక్కోసారి తలకిందులు అవుతూ ఉంటాయి. కాలం ఎల్లకాలం ఒకే రకంగా ఉండదు. ఎదుట వారి కష్టాలు చూసి నవ్వు కోకూడదు.రేపు మనకే కష్టం రావచ్చు. అర్థం చేసుకుంటూ పోవాలి.

శుభోదయం ....శశి బాల.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →