మంగళవారం29 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,529-3.07%
NIFTY22,716-3.12%
22K₹1,37,796/10g-2.70%
భాషలు

సంపాదకీయం

నిజంగా ప్రేమేనా... నీ అపోహనా?

నిజంగా ప్రేమేనా...నీ అపోహనా? స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి తను చదువు మీద ఆసక్తి చూపలేకపోతున్నానని, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని, చనిపోవాలన్నంత బాధగా ఉందని కౌన్సిలింగ్ కోసం ఒకసారి నా దగ్గరికి వచ్చింది. అంతగా ఆమెను వేధిస్తున్

Staff Reporter28 September 2026, 1:49 PM23 చూసులుtrinetnews.com
నిజంగా ప్రేమేనా... నీ అపోహనా?

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నిజంగా ప్రేమేనా...నీ అపోహనా?

స్కూలుకు వెళ్లే ఒక అమ్మాయి తను చదువు మీద ఆసక్తి చూపలేకపోతున్నానని, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నానని, చనిపోవాలన్నంత బాధగా ఉందని కౌన్సిలింగ్ కోసం ఒకసారి నా దగ్గరికి వచ్చింది. అంతగా ఆమెను వేధిస్తున్న సమస్య ఏంటి అని అడిగాను. నా ప్రశ్నకు సమాధానంగా తను ఇలా చెప్పసాగింది "పాఠశాలలో చదివే ఒక అబ్బాయి ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు నా పక్కనుండే బైక్ మీద వెళుతూ నన్ను చూసేవాడు. పండగలప్పుడు, నా పుట్టినరోజు నాడు చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చేవాడు. నేను వేసుకున్న డ్రెస్సు రంగు లాంటి రంగు ఉన్న షర్ట్ ధరించేవాడు, నేను తనను చూడగానే నవ్వే వాడు. అంతగా నన్ను ప్రేమించిన ఆ వ్యక్తి ఇప్పుడు నన్ను పట్టించుకోవడం మానేశాడు. నేను ఒంటరిదాన్ని అయిపోయానని బాధగా ఉంది. చదువు మీద ఆసక్తి చూపెట్టలేక పోతున్నాను. నాకు బ్రతకాలని లేదు" అని నాకు చెప్తూ ఏడ్చేసింది.

అదంతా విన్న తర్వాత ఆ అమ్మాయిని నేను ఇలా ఒక ప్రశ్న అడిగాను "నిజంగా ఇదంతా ప్రేమేనా లేక నీ అపోహనా?" అని. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆ ప్రశ్న విని ఆశ్చర్యపోయింది. ఏమి మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు.

అప్పుడు నేను ఆమెతో ఇలా అన్నాను. "నువ్వు ఏ రోజైనా, పాఠశాల విడిచిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లడం ఒక గంట ఆలస్యమైంది అనుకో. అప్పుడు మీ అమ్మగారు తన కూతురికి ఏమైందో అని కంగారుపడి ఇంట్లో అటు ఇటు తిరుగుతూ మీ తండ్రికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కోమని చెప్తుంది. అది తల్లి ప్రేమ.

ఆ విషయం తెలిసిన మీ నాన్నగారు నీకు ఏమైందో, ఆలస్యం ఎందుకు అయిందో తెలుసుకోవడానికి మీ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల దగ్గర వాకబు చేస్తాడు, ఇది తండ్రి ప్రేమ.

నీ స్నేహితురాళ్ళ ఇంటికి వెళ్లి, ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తూ, నువ్వు ఇంటికి వచ్చేవరకు కంగారుపడుతున్న అమ్మను ఓదారుస్తుంది నీ చెల్లి/అక్క లేదా తమ్ముడు/అన్న. ఇది తోబుట్టువు ప్రేమ.

వీళ్ళందరికీ నీ మీద ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంది. తల్లి నిన్ను తొమ్మిది నెలలు మోసి నీకు జన్మనిచ్చింది. తండ్రి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవు నువ్వు. తనతో పాటు ఒకే ఇంట్లో, ఒకే తల్లిదండ్రుల దగ్గర సుఖదుఃఖాలు పంచుకుంటూ తోడుగా నిలిచిన తోబుట్టువి. కాబట్టి వీళ్ళందరూ నీ మీద ప్రేమ చూపెడతారు. కానీ నీకు ఏ బంధుత్వం లేని ఒక బయట వ్యక్తి నీ మీద ఏ కారణంతో ప్రేమ చూపెడతాడు?

అసలు తను బైకు మీద నీ పక్కనుండి వెళ్లడం, నువ్వు వేసుకున్న రంగు దుస్తులను ధరించడం, నిన్ను చూసినప్పుడు నవ్వడం ఇదంతా ప్రేమ కాదు. కేవలం అది ప్రేమ అని నువ్వు భ్రమ పడడం మాత్రమే.

ప్రేమంటే నీ కష్టం తెలుసుకొని, అలాంటి సమయంలో నీకు తోడుగా నిలబడటం, నీకు ఇబ్బంది కలగకుండా తనను తాను మార్చుకోగలగడం, నీ భవిష్యత్తు కోసం ఆలోచించగలగడం, తెలియక చేసే నీ పొరపాట్లను క్షమించగలగడం. అంతేగానీ తల్లిదండ్రుల పైసలతో కొన్న బైకు మీద కొత్త కొత్త బట్టలు వేసుకొని, ఎలాంటి లక్ష్యం లేకుండా, నీ చుట్టూ తిరగడం ప్రేమ ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించు. రేపు నీకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే హాస్పటల్లో ఎన్ని రోజులైనా నీ పక్కన ఉండగలడా? అక్కడ అయ్యే ఖర్చు అంతా భరించగలడా? నీకోసం, కుటుంబాన్ని నడపడం కోసం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించగలడా? నిన్ను సంతోషంగా ఉంచాలంటే నీకు అసలు ఏం కావాలో అది తీసుకువచ్చేలా కనీస ప్రయత్నం చేయగలడా? నీ సమక్షంలోనే తన సంతోషాన్ని చూడగలడా? కేవలం సినిమాల్లోనూ, సోషల్ మీడియాలోనూ అమ్మాయిల వెంట తిరగడాన్ని చూసి అదే ప్రేమనుకుంటున్నారు.

ఏది ప్రేమో, ఏది భ్రమో విచక్షణ చేయగల వయసు నీకు ఇంకా రాలేదు. అప్పటివరకు నీ చదువు మీద దృష్టి పెట్టు. బాగా చదువుకుని, ఒక మంచి ఉన్నత స్థానంలో నువ్వు నిలబడి, ఇన్ని రోజులు నీకోసం కష్టపడిన నీ తల్లిదండ్రులని నువ్వు బాగా చూసుకోగలిగిన రోజు ఏది ప్రేమ ఏది భ్రమ అనేది నీకు అర్థమవుతుంది. అప్పటివరకు చదువు తప్ప ఇతర విషయాల మీదకు దృష్టి మరల్చకు.

*చివరగా ఒక్క మాట:* ఒక మంచి ఉద్యోగం సాధించి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగేంతటి ఆర్థిక స్థితికి నువ్వు రావాలి. అప్పుడు నువ్వు గెలిచినట్టు. ఒక బొట్టు బిళ్ళ కొనుక్కోవడానికి పది రూపాయలు ఇవ్వండి అని నీ భర్త దగ్గర చేయి చాచే పరిస్థితికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఓడిపోయినట్టే. భర్త నిన్ను నీ పిల్లలని చూసుకున్నా, చూసుకోలేని పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబాన్ని నువ్వే ముందుండి నడపగల ఆర్థిక స్తోమత, మానసిక స్థిరత్వం నువ్వు సాధించగలగడమే నీ విజయం.

ప్రేమ ఎప్పుడూ మాటల్లో కాదు, ఎదుటివారి చేతల్లో కనపడుతుంది. నీ కోసం ఏమేం చేస్తా అన్నాడో కాదు, ఏం చేశాడో చూడు. ఏం చేయగలడో ఆలోచించు.

M. Jaya Krishna Reddy

M.S. (Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

ఇవి కూడా చదవండి

అవుషాపూర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

అవుషాపూర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు

అవుషాపూర్ దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు అవుషాపూర్, సెప్టెంబర్ 29 (ట్రినెట్ న్యూస్): ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ జ్యోతి కుమార్ అవుషాపూర్‌లో నూతనంగా నిర్మించిన దుర్గామాత ఆలయంలో ఎస్ఎస్ఎస్ డివోషనల్ గ్రూప్ చైర్మన్ ప్రముఖ కేరళ

మిగతా చదవండి →

ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

ఘనంగా 'దారి ఎటు?' లఘుచిత్ర ప్రదర్శన

హైదారాబాద్, ట్రైనెట్ న్యూస్ సెప్టెంబరు 29: హైద్రాబాద్ లోని శ్రీ శ్రీ చిత్రశాల, ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శిరం సంజీవ్ నాయుడు నిర్మించిన "దారి ఎటు?" లఘుచిత్ర ప్రదర్శన వైభవంగా జరిగింది. ప్రముఖ స

మిగతా చదవండి →

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ 'లయన్స్ శతకం' ఆవిష్కరణ

శంకర నారాయణ సంపుటి లయన్స్ శతకం ఆవిష్కరణ హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 28: ప్రముఖ జర్నలిస్ట్ హాస్యావధాని శంకర నారాయణ రచించిన మరో శతకం లయన్స్ శతకం సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శ్రీ త్యాగరాయ గానసభ లోని క

మిగతా చదవండి →