బుధవారం21 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,736+1.31%
NIFTY22,796+0.77%
22K₹1,34,327/10g-1.19%
భాషలు

సాంస్కృతికం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివ

Staff Reporter21 October 2026, 4:20 AM4 చూసులుtrinetnews.com
వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం

చక్రధారుడి దివ్యస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు

లోకక్షేమం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం పవిత్ర అవభృథ స్నానం

తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

వైభవంగా పల్లకీ ఉత్సవం

చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

వేదమంత్రాల నడుమ స్నపన తిరుమంజనం

పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన ఈ పవిత్ర క్రతువులో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలను ఉపయోగించారు.టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలను పఠించారు.

అనంతరం తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి పాశురాలను పఠించారు. స్వామివారికి, అమ్మవార్లకు విశిష్టమైన పుష్పమాలలను అలంకరించారు.

లోకక్షేమం కోసం పవిత్ర అవభృథ స్నానం

తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు చక్రస్నానం సంపూర్ణతను చేకూర్చే పవిత్ర ఘట్టం. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, సకల జీవరాశులకు శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ అవభృథ స్నానాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలను మహాయజ్ఞంతో సమానంగా భావిస్తారు. యజ్ఞం ముగింపులో నిర్వహించే అవభృథ స్నానం మాదిరిగానే, బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల ద్వారా సమస్త లోకానికి శుభం కలగాలని, క్రతువుల సంపూర్ణ ఫలాలు లభించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు.

సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలకు పవిత్రత

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను పవిత్ర పుష్కరిణి జలాల్లో ముంచి చక్రస్నానం చేయించారు. అదే సమయంలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించినవారికి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నవారికి స్వామివారి అనుగ్రహంతో పాటు ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

భక్తిభావం, వేదమంత్రాల నడుమ జరిగిన చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీ ఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, శ్రీమతి పనబాక లక్ష్మి, డాలర్ దివాకర్ రెడ్డి, నరేష్ కుమార్, నన్నపనేని సదాశివరావు, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఆనంద సాయి, జేఈవో (హెచ్ అండ్ ఈ)గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

జేఎల్ స్కామ్: బీఆర్ఎస్ పాలనలో 150 మంది ఫేక్ లెక్చరర్ల నియామకం?

జేఎల్ స్కామ్లో కళ్లు తిరిగే నిజాలు బీఆర్ఎస్ పాలనలో 270 మందికి ఉద్యోగాలు 150 మంది సర్టిఫికెట్లు ఫేక్! హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ ఒక్కక్కటి బహిర్గతం అవుతున్

మిగతా చదవండి →

ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

ఎన్నికల కోడ్ నేప‌థ్యంలో ఎలాంటి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున శ్రీవారి దర్శనం, వసతి కోసం తిరుమలలో ఎలాంటి

మిగతా చదవండి →

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకోవాలి.. పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తప్పవు కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం.. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: స్థానిక

మిగతా చదవండి →

ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. త్వరలో ఎస్వీ మ్యూజియం ప్రారంభం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. త్వరలో ఎస్వీ మ్యూజియం ప్రారంభం: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

ఘనంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు విశేష సేవలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడి.. త్వరలో భక్తులకు అందుబాటులోకి ఎస్వీ మ్యూజియం తిరుమల, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 20: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర

మిగతా చదవండి →