మంగళవారం6 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX73,068+0.81%
NIFTY22,776+0.69%
22K₹1,38,356/10g-0.55%
భాషలు

సాంస్కృతికం

కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త

Staff Reporter6 October 2026, 7:44 AM8 చూసులుtrinetnews.com
కుటుంబ సభ్యుల సమక్షంలో డాక్టర్ తెన్నేటి సుధాదేవి 75వ జయంతి వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

కుటుంబ సభ్యులు అంతా చివరి వరకూ కలసి ఉండటం పెద్దలైన తల్లి తండ్రులు కు గొప్ప అనుభూతి ఇస్తుందని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ రాధా రాణి అన్నారు లోకం విడిచి వెళ్ళిన సుధా దేవి తన జయంతి భర్త తో పాటు కొడుకులు కోడళ్ళు వారి పిల్లలు కలిసి చేయటం ఆమె కు ప్రశాంత త ఇస్తుంది అని చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ తెన్నేటి సుధా దేవి 75 వ జయంతి వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు ఈ సందర్భంగా సుధా దేవి జ్ఞాపకం గా విశిష్ట పురస్కారాలు ప్రముఖ రచయిత్రి డి కామేశ్వరి కి ప్రముఖ మృదంగ కళా కారుడు ఏళ్ల వెంకటేశ్వర రావు కి ప్రముఖ నాట్య గురువు వోలేటి రంగ మణి కి ప్రముఖ రంగస్థల కళా కారుడు సురభి వేణు గోపాల రావు కి జస్టిస్ రాధా రాణి ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె వి రమణ తో కలసి బహుకరించారు డాక్టర్ రమణ మాట్లాడుతూ తొంభై ఏళ్ల పైబడిన కామేశ్వరీ ఎనభై ఏళ్ళ పై బడిన ఎల్లా వెంకటేశ్వర రావు డెభై ఏళ్ళు పై బడిన రంగమణి అరవై ఏళ్ళ వయసు పై పడిన వేణు గోపాల రావు వారి జీవిత కాలం లో చేసిన కృషికి గుర్తింపు పురస్కారం అన్నారు సుధా దేవి పేరుకు తగిన రచనలు లో మాటలో సుధలు ఉంటాయి అని గుర్తు చేసుకున్నారు అధ్యక్తత వహించిన వోలేటి పార్వతీశం మాట్లాడుతూసుధా దేవి సంస్మరణ గా వంశీ రామరాజు తన కుటుంబ సభ్యుల తో కలిసి చేస్తున్న కార్యక్రమం ప్రతి సంవత్సరం సాగాలని కోరారు వంశీ రామరాజు మాట్లాడుతూ పురస్కారం గా పాతిక వేల రూపాయలు నగదు ప్రశంసా పత్రం జ్ఞాపిక అందిస్తున్నాము అని తెలిపారు పురస్కార గ్రహీత డి కామేశ్వరి మాట్లాడుతూ దేవుడు నిత్యం నమస్కారాలు పూజలు వల్ల ఫలితం లేదని అవసరమైన వారికి సహాయం చేయడమే పుణ్య కార్యం అని చెప్పి తనకు అందించిన పాతిక వేల రూపాయల నగదు వృద్ధాశ్రమం నిర్వాహిస్తున్న డాక్టర్ రమణ కు అందజేశారు వేదిక పై తెలుగు అకాడమీ చైర్మెన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ దర్శకుడు రేలంగి నరసింహారావు కిమ్స్ స్థాపకుడు బొల్లినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు తొలుత సుధా దేవి రచించిన కథ అరవింద నాటకీకరించి శ్రీజ సాదినేని దర్శకత్వం వహించి ప్రదర్శించారు తరంగిణి రామ రాజు చే శాస్త్రీయ సంగీత గోష్టి అనఘ దత్త చే సింహా నందిని దేవాలయ సంప్రదాయ నాట్యం ఆకట్టుకున్నాయి

ఇవి కూడా చదవండి

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్

దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: గోలి ప్రభాకర్ నల్గొండ, అక్టోబర్ 6, ట్రినెట్ న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కో-కన్వీనర్ గోలి ప్

మిగతా చదవండి →