ఆదివారం27 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX73,896-1.29%
NIFTY23,141-1.17%
22K₹1,42,137/10g-1.26%
భాషలు

సాంస్కృతికం

‘స్వరనీరాజనం’ ఎస్. జానకి, ఎస్.పి.బాలు స్మృతిలో అపూర్వ సంగీత విభావరి

‘స్వరనీరాజనం’ ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం స్మృతిలో అపూర్వ సంగీత విభావరి హైదరాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబరు 27: ‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ఎస్. జానకి, ‘గాన గంధర్వుడు’ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

Staff Reporter27 September 2026, 1:42 PM58 చూసులుtrinetnews.com
‘స్వరనీరాజనం’ ఎస్. జానకి, ఎస్.పి.బాలు స్మృతిలో అపూర్వ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

‘స్వరనీరాజనం’ ఎస్. జానకి, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం స్మృతిలో అపూర్వ సంగీత విభావరి

హైదరాబాద్,రవీంద్ర భారతి, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబరు 27:

‘నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా’ ఎస్. జానకి, ‘గాన గంధర్వుడు’ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం స్మృతికి స్వరనీరాజనం అర్పిస్తూ.. ప్రముఖ సంస్థ రిషి మ్యూజికల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏఏఏ స్టూడియోలో 12 గంటలపాటు అద్భుతమైన సంగీత విభావరి నిర్వహించారు. సుమారు 35 మంది ప్రముఖ గాయనీ, గాయకులు పాల్గొని, బాలు–జానకి ఆలపించిన 100కు పైగా అపురూపమైన సినీ గీతాలను ఆలపించి సంగీతాభిమానులను అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, ప్రముఖ హాస్య నటులు బాబుమోహన్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్, హెచ్ఎండిఏ అధికారి దొనేపూడి చక్రపాణి, ప్రముఖ గాయకుడు త్రినాథరావు, మేడిది వెంకటేశ్వరరావు, దేవులపల్లి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాలు–జానకి ఆలపించిన ఎన్నో వేల గీతాలు శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి మధుర గాన సంపద అజరామరంగా నిలిచిపోతుందని కొనియాడారు.

కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకులు, హీరో సాందీప్ కు జానకి ఆత్మీయ బంధువు మిత్రా ఈవెంట్స్ నిర్వాహకులు శ్రీ హరే రాము అతిథుల చేతుల మీదుగా సంగీతాభిమానుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో వెంకట్ , ఉదయ్ భాస్కర్, వై. సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ గోర్తి, గోవిందాచార్య పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అతిథులు రిషి మ్యూజికల్ ఈవెంట్స్ అధినేత్రి అక్కిరాజు యోగితా ప్రభంజన్ ను

అభినందించారు.

ఇవి కూడా చదవండి

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

స్వేచ్ఛ మంచిదే కానీ హద్దులు లేకపోతే ప్రమాదమే!

ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం.... ..."స్వేచ్ఛ" ... మంచిదా చెడ్డదా..... పార్ట్.. 2 కొన్నిచోట్ల స్వేచ్ఛ అన్నది వ్యతిరేకమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అన్న విషయం మీద బాగ

మిగతా చదవండి →

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శ్రీ నందు 'కాసు' మూవీ గ్లింప్స్ లాంఛ్

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శ్రీ నందు 'కాసు' మూవీ గ్లింప్స్ లాంఛ్

స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా ఘనంగా శ్రీ నందు "కాసు" మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త సినిమా "కాసు". ఈ చిత్రంలో ఇందుకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఆర్. డ

మిగతా చదవండి →

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు

డేట్‌లైన్‌ను అమ్మనబోలు, నల్లగొండగా పెట్టి ఫైనల్ కాపీ ఇలా ఉంటుంది: కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు అమ్మనబోలు (నల్లగొండ), ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 27: ప్రత్యేక త

మిగతా చదవండి →

ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

ఈ నెల 28న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మహిళా కాంగ్రెస్ పిలుపు

28న చేపట్టనున్న నిరసన ర్యాలీని విజయవంతం చేయండి : - ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న హైదరా బాద్ లో నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్య

మిగతా చదవండి →