బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,938+2.32%
NIFTY25,819+2.34%
22K₹1,10,587/10g-0.65%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

స్వర మాధురి - సమ్మైక్యత పురస్కారాలు' ప్రధానం

The 10th anniversary of Swara Madhuri Cultural Service Organization and the 80th Independence Day were grandly celebrated at Sri Thyagaraya Gana Sabha.

nagendraఆదివారం, 16 ఆగస్టు 2026 · 3:02 AM16 వీక్షణలుtrinetnews.com
స్వర మాధురి - సమ్మైక్యత పురస్కారాలు' ప్రధానం

చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 :

స్వర మాధురి సాంస్కృతిక సేవా సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గాన సభ ప్రధాన వేదికలో "స్వర నృత్య వేడుక"ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరమాధురి సంస్థ అనేక విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. గాయని గాయకులతో పాటు కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు "స్వర మాధురి - సమ్మైక్యత పురస్కారాలు" అందజేశారు. సభకు ముందు ప్రముఖ గాయని సాయి పవని నిర్వహణలో గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీ రామరాజు, ప్రముఖ గాయకుడు త్రినాధరావు, యువ కళావాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీనారాయణ , ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణుడు దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

భారతదేశంలో TVS జూపిటర్ మరో అరుదైన ఘనత సాధించింది!

TVS మోటార్ కంపెనీకి చెందిన ప్రముఖ స్కూటర్ TVS జూపిటర్ 1 కోటి ఉత్పత్తి యూనిట్ల మైలురాయిని చేరుకుంది. TVS జూపిటర్ 2013లో మార్కెట్లోకి వచ్చింది. కేవలం 13 సంవత్సరాల్లో 1 కోటి యూనిట్ల ఉ

మిగతా చదవండి →

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

హైదరాబాద్: మాదాపూర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సుష్మా చౌదరి (28) అనే యువతి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుష్మా చౌదరి తన స్నేహితుడు కొతిలి

మిగతా చదవండి →

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

ఎన్నికల ప్రభావంతో ఏపీలో ముందుగానే పింఛన్ల పంపిణీ!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు చేసింది. ఎన్నికల విధుల కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ముందుగాన

మిగతా చదవండి →

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →