హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 19: నాటకాలు మనుషుల్లోని అమానవీయ ఆలోచనలను తొలగించే విధం గా ఉండాలని రాష్ట్ర వినియోగ దారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు జస్టిస్ రాధా రాణి అన్నారు సాంఘీక నాటకం సమాజ ప్రతిబింబం అని చెప్పారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో భాషా సాంస్కృతిక సౌజన్యం తో జరుగుతున్న పౌరాణిక పద్య సాంఘీక నాటకోత్సవం లో భాగంగా గురు వారం జయ ఆర్ట్స్ (,హైదరాబాద్) వారిచే డాక్టర్ ఉషా గాయత్రి రచించిన కథను గ్రహించి శ్రీజ సాదినేని నాటకీకరణ చేసి దర్శకత్వం వహించిన డస్ట్ బిన్ నాటిక స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ (,హైదరాబాద్) వారిచే పూర్ణిమ రచించిన కథను నాటకీకరణ చేసి ఉదయ్ భాగవతుల దర్శకత్వంలో స్త్రీ మాత్రే నమః నాటిక ను ప్రదర్శించారు రెండు నాటికలు వర్తమాన సమాజం లోని నేటి తరం మనోభావాలకు అద్దం పట్టాయి ఈ సందర్భం గా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ రాధా రాణి మాట్లాడుతూ నాటకం ప్రేక్షకుడు చూసి మరచిపోవడం కాకుండా ఆలోచనలు వెంటాడాలీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ దాసరి వెంకట రమణ మాట్లాడుతూ సమాజం లో పలు మధ్యమాలు వస్తున్నా వేటి ప్రాధాన్యత వాటిది అన్నారు కృత్రిమత్వం లేనిది ప్రత్యక్షం గా కళా కారులు నటన చూడగలిగేది నాటకం అన్నారూ నాటకం సజీవం నిలిచి ఉంటుందని చెప్పారు హోమియో వైద్యులు డాక్టర్ దుర్గా ప్రసాద్ రావు మాట్లాడుతూ నాటకాలు కి విశృత ప్రచారం ముఖ్యం అన్నారు కిన్నెర రఘురాం స్వాగతం పలుకుతూ తమ సంస్థ అధ్యక్షులు ఆర్ ప్రభాకర రావు 92 వ పుట్టిన రోజు అని శుభాముఖం గా శుభాకాంక్షలు తెలిపారు కిన్నెర సుబ్బారావు రాధా కృష్ణ శ్యామ్ సుందర్ విజయ కుమార్ సతీష్ చౌదరి పాల్గొన్నారు






