‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు’ పేరుతో సీజన్–22
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14: కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎస్ఎం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ ఆధ్వర్యంలో ‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు’ భక్తి సంగీత కార్యక్రమం శనివారం నిర్వహించారు. శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సంగీత నాట్య వేదిక హాలులో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం జరిగింది.సంస్థ నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమాల పరంపరలో సీజన్–22గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తి ప్రధాన ఇతివృత్తంతో సంగీత సమర్పణ సాగింది. కార్తీక మాస విశిష్టతను, భక్తి సంగీత సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.





