హైదారాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, నవంబరు 13:
నాటక రంగం శ్వాస గా కళాకారుల అభ్యున్నతి లక్ష్యం గా కృషి చేసిన ఏ అర్ కృష్ణ తెలుగు నాటక రంగ స్వర్ణ యుగ కర్త అని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యులు మండలి బుధ ప్రసాద్ కొని యాడారు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై గాన సభ పద్మ భూషణ్ ఏ అర్ కృష్ణ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహణలో ఏ అర్ కృష్ణ శత జయంతి సందర్భంగా ఏ అర్ కృష్ణ దుగ్గిరాల సోమేశ్వర రావు పేరిట ప్రముఖ రచయిత నటుడు సంజీవి కి పురస్కార ప్రదానం సభ జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి బుధ ప్రసాద్ గాన సభ అధ్యక్తుడు కళా జనార్థన మూర్తి ప్రముఖ రంగస్థల ప్రయోక్త డి ఎస్ ఎన్ మూర్తి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు కృష్ణ, సోమేశ్వర రావు ల కుమారులు డాక్టర్ దుగ్గిరాల గౌరీ పతి శాస్త్రి ప్రకాష్ నీలం లతో కలిసి సంజీవి నీ జ్ఞాపిక శాలువ పదివేల రూపాయల నగదు తో సత్కరించారు బుధ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తదుపరి నాటక రంగం లో వివిధ దేశాల్లో అధ్యయనం చేసిన కృష్ణ తెలుగు రంగస్థలం పై వివిధ ప్రయోగాలు చేసి సంచలనం సృష్టించిన మహా వ్యక్తి అన్నారు మాల పల్లి నాటకం ప్రయోగాత్మక గా వంద మంది కళా కళాకారులతో ప్రదర్శించి చరిత్ర సృష్టించారనీ చెప్పారు తెలుగు వారి గొప్పతనం ప్రచారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ శత జయంతి సంవత్సరం అంతా చేయాలి అని కోరారు అధ్యక్తత వహించిన ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ చైర్మెన్ గుమ్మడి గోపాల కృష్ణ మాట్లాడుతూ నాటక రంగంలో పద్మ భూషణ్ తొలి సారిగా అందుకున్న వారు ఏ అర్ కృష్ణ అని చెప్పారు ఆయన నట శిక్షణా కేంద్రం స్థాపించి ఎందరినో ప్రముఖ కళా కారులు గా దేశానికి అందించారూ అని వారిలో పురస్కార గ్రహీత సంజీవి ఒకరు అని చెప్పారు సంజీవి సినిమా నాటకం టి వి మధ్యమాలకు రచయిత గా అగ్రస్థానం నిలిచిన నిస్వార్థ కళా ప్రియుడు అని ప్రశంసించారు కృష్ణ విగ్రహం స్థాపన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపేందుకు కృషి చేస్తాము అని తెలిపారు. సినీ రచయిత రాజేంద్ర కుమార్ వేదిక అధ్యక్షుడు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు తొలుత సింహ ప్రసాద్ రచించిన మూల్యం నాటిక గోవాడ వెంకట్ దర్శకత్వం లో ప్రదర్శించారు







