బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

ఉత్సాహంగా.. ఉల్లాసంగా న్యాయవాదుల సాంస్కృతిక వేడుక మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

nagendraశనివారం, 14 నవంబర్ 2026 · 4:50 AM18 వీక్షణలుtrinetnews.com
ఉత్సాహంగా.. ఉల్లాసంగా న్యాయవాదుల సాంస్కృతిక వేడుక మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా కల్చరల్ ఈవెంట్

హైదరాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:

న్యాయవాదుల్లోని కళా ప్రతిభను ప్రోత్సహిస్తూ, వృత్తిపరమైన ఐక్యతను బలోపేతం చేసే లక్ష్యంతో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ (ఎంసీసీబీఏ) నిర్వహించిన మెగా కల్చరల్ ఈవెంట్ ఉత్సాహంగా సాగింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన ఈ వేడుకలో న్యాయవాదులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.

ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి, గౌరవ అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావు, సీబీఐ న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు, సెషన్స్ జడ్జి సాయిరామదేవి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నిత్యం కేసుల వాదనలు, వృత్తిపరమైన బాధ్యతలతో తీరిక లేకుండా గడిపే న్యాయవాదులు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడం ఆనందదాయకమన్నారు. కళలు, వినోద కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని అందించడంతో పాటు పరస్పర స్నేహభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. సభకు ముందు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో న్యాయవాదులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రెట్టాల బాలరాజ్ గౌడ్, ఉపాధ్యక్షులు పి.ఎల్. నరేష్ కుమార్, బాబితా పవార్, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రాజంపేట, సంయుక్త కార్యదర్శులు టి. చంద్రశేఖర్, ఎం. సంధ్యారాణి, లైబ్రరీ కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి అక్కపాక విద్యాసాగర్, క్రీడా–సాంస్కృతిక కార్యదర్శులు బొడ్డుపల్లి శ్రీనివాస్, రమా సుభద్ర, ఎస్.ఎం. ప్రమీల, ఎక్స్‌అఫీషియో సభ్యుడు కె. రవికిషోర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :